Ponnam Prabhakar Goud | తెల్ల రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులందరికీ సన్నబియ్యం : మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్
Ponnam Prabhakar Goud | హుస్నాబాద్ పట్టణంలోని బుడగ జంగం కాలనీలో సన్న బియ్యం పథకాన్ని ఇవాళ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులందరికీ సన్నబియ్యం అందిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్.
Ponnam Prabhakar Goud | హుస్నాబాద్ టౌన్, ఏప్రిల్ 1 : రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ నేటి నుంచి సన్న బియ్యం పథకాన్ని అందిస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. హుస్నాబాద్ పట్టణంలోని బుడగ జంగం కాలనీలో ఇవాళ సన్న బియ్యం పథకం మంత్రి పొన్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ.. తెల్ల రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులందరికీ సన్నబియ్యం అందిస్తామన్నారు. ఈ పథకం దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణలో ప్రారంభించడం జరిగిందని.. ఇది దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ఆయన చెప్పారు.
రాష్ట్రంలోని 17,263 చౌకధరల దుకాణాల ద్వారా రేషన్ కార్డు లబ్ధిదారులకు బియ్యాన్ని అందిస్తున్నట్లు ఆయన వివరించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని సన్న బియ్యం పథకాన్ని అందిస్తున్నామని.. దీని ద్వారా రాష్ట్రంలో రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా అడ్డుకట్ట వేయడం జరుగుతుందని చెప్పారు.
గతంలో దొడ్డు బియ్యం రేషన్ షాపుల నుంచి ఇంటిదాకా కూడా చేరలేదని.. పక్కదారి పట్టాయని ఇకనుంచి అలాంటి పరిస్థితులు ఎక్కడా కనిపించవన్నారు. ప్రతి ఒక్కరు సన్న బియ్యాన్ని వినియోగించుకుంటారని మంత్రి పొన్నం ఆశాభావం వ్యక్తం చేశారు.
గ్యాస్ డబ్బులు రావట్లేదు..
చింతల లలిత అనే మహిళ తనకు గ్యాస్ డబ్బులు రావడం లేదని సన్న బియ్యం పథకం ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కేంద్ర ప్రభుత్వం విధానం వల్ల కొన్ని ఇబ్బందులు జరిగాయని, గ్యాస్ డబ్బులు తప్పనిసరిగా వచ్చేందుకు కృషి చేస్తామని ఆమెకు హామీ ఇచ్చారు. చిన్నచిన్న ఇబ్బందులు ఏమున్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మను చౌదరి, అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, ఆర్డీఓ రామమూర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య తదితరులు ఉన్నారు.
Read Also :
AP News | వారం రోజుల నుంచి గుడి ముందు నగ్నంగా పూజలు.. ఉగాది రోజు సజీవ సమాధికి యత్నం!
Jagadish Reddy | ఆ భాషే ఆయన్ను బొందపెడుతుంది.. సీఎం రేవంత్ రెడ్డిపై జగదీశ్ రెడ్డి ధ్వజం
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

