Grain Purchase Centres | రాయపోల్, మే 13: సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరి కోతలు ముమ్మరంగా సాగుతుండటంతో కేంద్రాలకు భారీగా ధాన్యం చేరుతోంది. దీంతో కొనుగోలు కేంద్రాలు ధాన్యం కుప్పలతో నిండిపోతున్నాయి. అయితే తూకం వేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించడంలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరత తీవ్రంగా ఉండటంతో తూకం పూర్తయిన ధాన్యం రోజులు గడిచినా అక్కడికక్కడే పేరుకుపోతోంది. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రైతులు ధాన్యం వద్దే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఎర్రటి ఎండలో రైతులు పడుతున్న ఇబ్బందులు వర్ణణాతీతంగా మారాయి. ఇక కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కనీస వసతులు కూడా లేకపోవడంతో సమస్యలు మరింత పెరుగుతున్నాయి. తాగు నీరు, నీడ, కూర్చునే ఏర్పాట్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు జల్లిపడితేనే ఐకేపీ సిబ్బంది ధాన్యం తూకం వేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
కేంద్రాల్లో జల్లిక కొరత కూడా తీవ్రంగా ఉండటంతో కొనుగోలు ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. ధాన్యం తూకం వేసిన వెంటనే మిల్లులకు తరలించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. అలాగే లారీల సంఖ్య పెంచి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.



Satyavathi Rathod | పబ్బులు, క్లబ్బుల్లో గొడవలప్పుడే బుద్ధి చెప్పాల్సి ఉండే : సత్యవతి రాథోడ్
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ అంకిత్
YCP MLC | వైసీసీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు