రాయపోల్,08 : యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. అవసరానికి తగ్గట్టు యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు ఆందోళన గురవుతున్నారు. వానకాలం సీజన్ ప్రారంభమై పంటలు సాగుచేసిన రైతులు యూరియా కొరత ఏర్పడడంతో ప్రతిరోజు యూరియా కోసం నాన్న ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలోని ఆగ్రోస్ సెంటర్కు 400 బస్తాల యూరియా రావడంతో ఉదయం నుంచి రైతులు క్యూ లైన్ కట్టి యూరియా కోసం తిప్పలు పడ్డారు.
మండలంలోని మొక్కజొన్న, వరి పంటలకు సరిపడా యూరియా అందించాలని రైతులు కోరుతున్నారు.
కేవలం రెండు బస్తాలు యూరియా ఇస్తే తమకు ఎలా చాలుతుందని వాపోతున్నారు. మండలంలో అధిక శాతం రైతులు మొక్కజొన్న పంటను సాగు చేశారు. వర్షాలకు ఏపుగా పెరిగడంతో ప్రస్తుతం యూరియా అవసరం ఉండడంతో రైతులు ప్రతిరోజు యూరియా కోసం ఎదురుచూస్తున్నారు. కాగా మంగళవారం కొద్దిమందికే యూరియా అందడంతో పలు గ్రామాలకు చెందిన రైతులు క్యూ లైన్ లో ఉన్నప్పటికి యూరియా అందకపోవడంతో రైతులు నిరాశతో వెనుతిరిగి వెళ్లిపోయారు.