Ex Sarpanches | హుస్నాబాద్ టౌన్, మే 27: గ్రామ పంచాయతీలో చేసిన పనులకు సంబంధించిన బకాయిలను తక్షణమే చెల్లించాలని కోరుతూ మాజీ సర్పంచులు చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని హుస్నాబాద్ పోలీసులు పలువురు మాజీ సర్పంచులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
ఇవాళ ఉదయం నుంచి గ్రామాలకు వెళ్లిన పోలీసులు మాజీ సర్పంచులను హైదరాబాద్ వెళ్లకుండా అడ్డుకొని హుస్నాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. గ్రామ అభివృద్ధి కోసం చేపట్టిన పనులకు సంబంధించిన బకాయిలను చెల్లించాలని న్యాయంగా అడిగితే పోలీసులు వెళ్లకుండా అడ్డుకోవడమేమిటని మాజీ సర్పంచులు ప్రశ్నించారు. వారంతా ప్రభుత్వ తీరును నిరసించారు.
తమ బకాయిలను చెల్లించి ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు వంగ వెంకటరామిరెడ్డి, బత్తుల శ్రీనివాస్, బత్తిని సాయిలు తోపాటు పలువురు ఉన్నారు.
Rains | హైదరాబాద్కు నేడు నైరుతి.. ఎప్పుడైనా భారీ వర్షం కురిసే అవకాశం..!
Metuku Anand | కేటీఆర్కు ఏసీబీ నోటీసులు.. కాంగ్రెస్ దిగజారుడుతనానికి నిదర్శనం : మెతుకు ఆనంద్
US Visa | క్లాస్లు ఎగ్గొట్టినా వీసాలు రద్దు.. విదేశీ విద్యార్థులకు ట్రంప్ సర్కార్ కీలక హెచ్చరికలు