జహీరాబాద్, డిసెంబర్ 9 : మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని జహీరాబాద్ డీఎస్పీ రఘు తెలిపారు. శనివారం జహీరాబాద్ ఆర్టీసీ బస్టాం డ్ ఆవరణలో మహాలక్ష్మి పథకాన్ని డీఎం సూర్యనారాయణతో కలిసి డీఎస్పీ రఘు ప్రారంభించారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే సౌకర్యం ఉందన్నారు. ఉచితంగా ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సులో ప్రయణించే అవకాశం ఉందన్నారు. మహి ళలు ఎదైనా గుర్తింపు కార్డులు వెంట తెచ్చుకోవాలన్నా రు. జహీరాబాద్ నుంచి లింగంపల్లికి బస్సును ప్రారంభించారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఆర్టీసీ డిపో మేనేజరు సూర్యనారాయణ, జహీరాబాద్ రూరల్ సీఐ. వెంకటేశ్, పట్టణ ఎస్ఐ. శ్రీకాంత్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కండెం నర్సింహులు, నాయకులు ఎంజీ. రాములు, ఖాజామియాతో పాటు పలు మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పటాన్చెరులో మహలక్ష్మి పథకం ప్రారంభం
పటాన్చెరు బస్ టెర్మినల్‌లో మహలక్ష్మి పథకాన్ని శనివారం కాంగ్రెస్ నాయకుడు కాట శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు. ప్రత్యేకంగా అలంకరించిన ఆర్టీసీ బస్సుకు కాంగ్రెస్ నాయకులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బస్సు ముందుకు కదిలింది. ఈ సందర్భంగా మిఠాయిలు పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో చేసిన 6 గ్యారంటీల్లో మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ముఖ్యమైనదన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన మూడు రోజుల్లోనే తమ ప్రభుత్వం ఈ స్కీమ్‌ను ప్రారంభించిందన్నారు.
మహిళలకు ఎంతో ఉపయోగకరమైన పథకం అని కొనియాడారు. కార్యక్రమం లో మండల అధ్యక్షుడు సుధాకర్‌గౌడ్, నర్సింహారెడ్డి, ఎంపీటీసీ గడ్డం శ్రీశైలం, మాజీ సర్పంచ్‌లు వెంకన్నయాదవ్, గోపాల్‌రెడ్డి, శివానందం, చంద్రయ్య, రహీం, గోపాల్, సంతోశ్, నర్సింహులు, ఎట్టయ్య, నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
బస్సును ప్రారంభించిన డీఎస్పీ
పట్టణంలోని రాజీవ్ చౌరస్తాలో మహిళల ఉచిత ప్రయాణ బస్సును ఖేడ్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి, స్థానిక డిపో మేనేజర్ మల్లేషయ్య శనివారం ప్రారం భించారు. ఈ సందర్భంగా నూతన ఎమ్మెల్యే సంజీవరెడ్డి సతీమణి అనుపమారెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాగా, అధికారులతో పాటు ఆమె పచ్చ జెండాను ఊపి ప్రారంభించారు. అనంతరం బస్సులో తోటి మహిళలతో కలిసి ప్రయా ణం చేశారు. కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్ఐ విద్యాచరణ్‌రెడ్డి, ఆర్టీసీ అధికారులు, నాయకులు పాల్గొన్నారు.