రాయపోల్ మే 21 : సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలోని ఆగ్రోస్-1, ఆగ్రోస్ 2 లో పచ్చిరొట్ట ఎరువుగా ఉపయోగించే జనుము విత్తనాల పంపిణీ కార్యక్రమానికి ఉమ్మడి దౌల్తాబాద్ మండలం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి కనకయ్య, రాయపోల్ సర్పంచ్ మాసంపల్లి రాజు, ముఖ్య అతిథిలుగా హాజరై రైతులకు జిలుగు, జనుము విత్తనాలను శుక్రవారం పంపిణీ చేశారు. వ్యవసాయ భూములలో నేల సారాన్ని పెంచడం, సాగు ఖర్చులను తగ్గించడం లక్ష్యంగా ప్రభుత్వం పచ్చిరొట్ట ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహిస్తోందని వారు తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు అధిక మొత్తంలో రసాయన ఎరువులను వినియోగించడం వల్ల భూముల భూసారం క్రమంగా తగ్గిపోతుందని వారు అన్నారు. పచ్చిరొట్ట ఎరువులైన జనుము పంటను సాగు చేసి భూమిలో కలపడం ద్వారా నేలలో సేంద్రీయ పదార్థాలు పెరిగి భూమి భూసారని పెంచుతుందని దీంతో పంటలు అధిక దిగుబడి వస్తుందని వారు తెలిపారు.
రైతులు ప్రతి సీజన్లో కనీసం కొంతభాగంలో అయినా పచ్చిరొట్ట ఎరువుల సాగు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏవో నరేష్. మాజీ నీటి సంఘం చైర్మన్ సత్తు గారి కిష్టారెడ్డి. యూత్ నాయకులు నర్సింగరావు. మహేష్ యాదవ్. ఆగ్రోస్ రైతు సేవ కేంద్రం నిర్వాహకులు కాసుల అంజిరెడ్డి. భాగన్నగారి జనార్దన్ రెడ్డి. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.