చేర్యాల, మే 11 : కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి వారి క్షేత్రానికి బుధవారం భక్తులు భారీగా తరలివచ్చినట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వామి వారి క్షేత్రానికి వచ్చిన భక్తులు స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు నిత్య కల్యాణోత్సవంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నట్లు తెలిపారు.
వేసవి సెలవులు కావడంతో భక్తులు ఆది,బుధవారాల్లో కొమురవెల్లికి భారీగా వస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గీస భిక్షపతి, ఏఈవో వైరాగ్యం అంజయ్య, ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, సూపరింటెండెంట్ నీల శేఖర్, సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులున్నారు.