సిద్దిపేట/చేర్యాల : ప్రముఖ పుణ్య క్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో మంగళవారం దేవీ త్రీరాత్రోత్సవాలను ఆలయ వర్గాలు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. మల్లన్న ఆలయంలో ప్రత్యేక మండపం ఏర్పాటు చేసి అర్చకులు దేవి విగ్రహాన్ని ప్రతిష్టించి మహగణపతి, గౌరి, కంకణధారణ, స్వస్తి పుణ్యవాచనం, రుత్విక్ వరణం, నవగ్రహ దిప్వాలక, జగద్గురు పంచార్య, ఆఖండ దీపారాదన, ఆంకురార్పణ, ప్రధాన కళశస్థాపన అమ్మవారికి చతురుషష్టి రకాల ఉపచార పూజలు నిర్వహించారు.
అనంతరం అగ్ని ప్రతిష్టా మహగణపతి ఆవాహిత మండప దేవత పూర్వక విశేష మహ సరస్వతి మూల మంత్ర హోమం నిర్వహించారు. అలాగే షోడోపచార పూజ, మహా మంగళహారతి, మహమంత్ర పుష్పం పూజలు చేశారు. మూడు రోజుల పాటు సనాతన ఆగమ శాస్త్ర సంప్రదాయ బద్ధంగా ఆలయంలో దేవి పూజలు ఘనంగా నిర్వహించనున్నారు.