గజ్వేల్, జూలై 18: నానో యూరియా వాడకంతో పంటలకు లాభాదాయకంగా ఉంటుందని, వ్యవసాయ ఉత్పత్తుల ఉత్పాదకత, నాణ్యతను మెరుగుపర్చుతుందని జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి అన్నారు. శుక్రవారం గజ్వేల్లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆమే మాట్లాడుతూ నానో నేల ఆరోగ్యాన్ని మెరుగుపర్చుతుందని, గాలి, నీటి కాలుష్యాన్ని తగ్గిస్తుందన్నారు.
నానో ఎరువులను బయోస్టిమ్యులెంట్స్లను వ్యవసాయ రసాయనాల్లో కలపవచ్చాన్నారు. తెగులు వ్యాధి సంభావనీయతను తగ్గింస్తుందన్నారు. రైతులు నానో యూరియా వాడకాన్ని అలవాటు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఏడీఏ బాబునాయక్, ఏవో నాగరాజు, ఇఫ్కో సంస్థ రాష్ట్ర మేనేజర్ కృపాశంకర్, జిల్లా మేనేజర్ చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.