మద్దూరు : సిద్దిపేట జిల్లా మద్దూరు, ధూళిమిట్ట మండలాలలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో వరి, మొక్కజొన్న, పత్తి తదితర పంటలు ఎండిపోతున్నాయి. దీనికి తోడు కరెంటు సరిగా లేకపోవడంతో పాటు నీటి సరఫరాలో కాంగ్రెస్ నిర్లక్ష్యగా ఉండటంతో నష్టం జరుగుతుందని రైతులు వాపోతున్నారు. బీఆర్ఎస్ పానలో ఇలాంటి పరిస్థితులు ఎన్నడు రాలేదన్నారు.
మద్దూరు మండలంలోని రేబర్తి గ్రామానికి చెందిన కూరేళ్ల సత్యనారాయణ గౌడ్ అనే రైతుకు చెందిన రెండు ఎకరాల వరి పంట ఎండిపోయింది. పంట సాగు కోసం సుమారు లక్ష రూపాయలు ఖర్చు చేశానని, వరి చేను ఎండిపోవడంతో తను తీవ్రంగా నష్టపోయారని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు ఎండిపోయి నష్టపోయిన ఆదుకోవాలని పలువు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.