 
                                                            రాయపోల్ అక్టోబర్ 31 : తుఫాన్ కారణంగా గ్రామాల్లో తడిసిపోయిన ధాన్యాన్ని శుక్రవారం గజ్వేల్ డివిజన్ వ్యవసాయ శాఖ ఏడీఏ మండల ప్రత్యేక అధికారి బాబు నాయక్ పరిశీలించారు. ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని మంతుర్ గ్రామంలో ప్రకటించారు. గ్రామంలో ఐకెపి కందుకూరు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యాన్ని పరిశీలించారు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టలని సూచించారు. అలాగే మొక్కజొన్నలు కూడా ఆరబెట్టాలని ఆయన రైతులకు సూచించారు. రైతులు అధికారుల ఇచ్చే వాతావరణ సలహాలు సూచనలు పాటిస్తూ వరి, మొక్క జొన్న పంటలను ఆరబెట్టు కోవాలన్నారు.
అదే విధంగా తేమ శాతం వచ్చిన వరి ధాన్యాన్ని పరిశీలించి తేమ శాతం వచ్చిన వాటిని వెంటనే కాంట వేయించాలని సెంటర్ నిర్వాహకులకు సూచించారు. రైతులకు గిట్టుబాటు ధర లభించే విధంగా గ్రామ గ్రామాన ఐకెపి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఆర్ నరేష్, వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రవీణ్, ఆశ్లేష పాల్గొన్నారు.
 
                            