రాయపోల్ డిసెంబర్ 19 : యూరియా బుకింగ్ యాప్‌పై రైతులు అవగాహన కలిగి ఉండాలని గజ్వేల్ డివిజన్ వ్యవసాయ శాఖ ఏడీఏ బాబు నాయక్ అన్నారు. సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలోని రైతు వేదికలో యూరియా బుకింగ్ యాప్ పై రైతులకు అవగాహన కల్పించారు. యూరియా కోసం రైతులు ఇంట్లో కూర్చొని ఫర్టిలైజర్ బుకింగ్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకొని యూరియా సంచులను బుక్ చేసుకోవచ్చన్నారు.
ప్రతి రైతు ప్రస్తుతం జిల్లాలోని అన్ని షాప్ లలో బుక్ చేసుకొనే అవకాశం ఉందని తెలిపారు. యూరియా బుకింగ్ లో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వ్యవసాయ విస్తరణ అధికారులను గానీ, డీలర్స్ గానీ సంప్రదించవచ్చునని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఆర్ నరేష్, వ్యవసాయ విస్తరణ అధికారులు రజిత, తదితరులు పాల్గొన్నారు.