మద్దూరు(ధూళిమిట్ట), మే14: శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు కృషి చేయాలని హుస్నాబాద్ ఏసీపీ ఎస్. సదానందం అన్నారు. గురువారం మద్దూరు పోలీస్ స్టేషన్‌ను ఏసీపీ సందర్శించారు. ఏసీపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా మద్దూరు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఏసీపీ సదానందానికి చేర్యాల సీఐ శ్రీను, మద్దూరు ఎస్ఐ షేక్ మహబూబ్ పూల మొక్కను అందించ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ నేరాల నియంత్రణకు పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు.
అవినీతికి తావులేకుండా నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలన్నారు. రక్షణ కోసం పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులదేనన్నారు. కార్యక్రమంలో ఏఎస్ఐ సదాశివరావు, పోలీస్ సిబ్బంది ఉన్నారు. అనతంరం ఏసీపీ సదానందంను జయశంకర్ సేవా సమితి వ్యవస్థాపకులు కొత్తపల్లి సతీశ్‌కుమార్ మర్యాదపూర్వకంగా కలుసుకొని శాలువాతో సన్మానించారు.