Drugs | రాయపోల్, జులై 29 : మత్తు పదార్థాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని గజ్వేల్ ఏసీపీ నర్సింలు, తొగుట సిఐ షేక్ లతీఫ్, దౌల్తాబాద్ ఎస్ఐ అరుణ్ కుమార్ హెచ్చరించారు. దౌల్తాబాద్ మండల కేంద్రంలోని వివిధ షాపులలో గంజాయి, మత్తును కలిగించే పదార్థాలు ఏవైనా ఉన్నాయేమో అనే అనుమానంతో డాగ్ స్క్వాడ్ సహాయంతో షాపుల్లో వెతకడం జరిగిందన్నారు. అలాగే మత్తు పదార్థాలు ఎక్కడైనా కనిపించినా, అట్టి వాటి గురించి ఏదైనా సమాచారం తెలిసినా పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలన్నారు.
అలాగే పిల్లలు, పెద్దలు ఎవరూ కూడా మత్తు పదార్థాలకు బానిస కావద్దు అని.. ప్రజలు అందరూ కలిసి కట్టుగా మన దౌల్తాబాద్లోకి ఎలాంటి మత్తు పదార్థాలు విక్రయించకుండా పోరాడాలని కోరారు. మత్తు పదార్థాలు విక్రయించే వ్యక్తుల గురించి తెలిస్తే పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలి. అలా ఎవరైనా సమాచారం ఇవ్వవచ్చు మాకు సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు. గ్రామాల్లో శాంతియుత వాతావరణం కోసం అందరూ కలిసి కట్టుగా ఉండాలని వారు సూచించారు.
చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. రానున్న ఎన్నికలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎలాంటి గొడవలు లేకుండా శాంతియుత మార్గంలో జరుపుకోవాలని సూచించారు. అలాగే గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం బెల్ట్ షాపులు. మత్తు పదార్థాలు విక్రయిస్తే కేసులు తప్పవు అని వారు స్పష్టం చేశారు. రోడ్డు భద్రత నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, వాహనదారులు హెల్మెట్లు ధరించాలని, మైనర్లకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని గుర్తు చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది. తదితరులు పాల్గొన్నారు.
Nalgonda : నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం
YS Jagan | రెడ్‌బుక్ తరహాలో వైసీపీ యాప్.. వాళ్లందరికీ సినిమా చూపిస్తానని వైఎస్ జగన్ వార్నింగ్
Watch: స్కూటర్‌ను ఢీకొట్టిన వాహనం.. ఆపై రివర్స్‌లో వచ్చి వృద్ధుడ్ని ఢీ