సిద్దిపేట,మార్చి 25 : సిద్దిపేట దవాఖాన పనులు పూర్తిచేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రభుత్వంపై మండి పడ్డారు. సిద్దిపేట వెయ్యి పడకల దవాఖాన, నర్సింగ్ కళాశాల పనులు ప్రారంభించాలని బుధవారం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఆయన కోరారు.
సిద్దిపేటలోని మెడికల్ కాలేజీ టీచింగ్ దవాఖాన పనులు 90శాతం బీఆర్ఎస్ హయాంలో పూర్తయ్యాయని, 10 శాతం పనులే మిగిలి పోయాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ 27 నెలల్లో తట్టెడు మట్టి ఎత్తిన పాపాన పోలేదన్నారు. సంబంధించి మంత్రి, అసెంబ్లీ సమావేశాల్లో పదే పదే ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చినా పట్టించుకోవడం లేదన్నారు.నర్సింగ్ కాలేజీ కిరాయి భవనంలో నడుస్తున్నదని, దూరం భారంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. వెంటనే ప్రభుత్వం పనులు పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని కోరారు.