మెల్బోర్న్: ఈ ఏడాది డిసెంబర్ నుంచి జరుగబోయే బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్)లో ఆరంభ మ్యాచ్‌ను భారత్ (చెన్నై)లో నిర్వహించేందుకు సిద్ధమవుతున్న క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) మరో ప్రతిష్టాత్మక టెస్టును ఇక్కడ జరిపించేందుకు ప్రణాళికలు రచిస్తున్నది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య రెండేండ్లకోమారు జరిగే యాషెస్ సిరీస్‌లో భాగంగా ఒక టెస్టును భారత్‌లో నిర్వహించే యోచనలో ఉన్నట్టు సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టాడ్ గ్రీన్బర్గ్ తెలిపాడు.
ఓ పాడ్‌కాస్ట్‌లో గ్రీన్బర్గ్ మాట్లాడుతూ.. ‘బీసీసీఐతో పాటు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుతో మాకు మంచి సంబంధాలున్నాయి. భారత్‌లో క్రికెట్ వినోదాన్ని మరింత అందించేందుకు అవకాశాలున్నాయి. అయితే దానిపై (యాషెస్ నిర్వహణపై) ఇప్పుడే చెప్పలేం. కానీ రాబోయే రోజుల్లో మాత్రం ఆ దిశగా ఆలోచిస్తాం’ అని వెల్లడించాడు.