ఢిల్లీ: ఆసియా గేమ్స్‌లో భారత క్రికెట్ జట్లు (మెన్స్, ఉమెన్స్) నేరుగా క్వార్టర్స్ నుంచే బరిలోకి దిగనున్నాయి. ఇరు విభాగాల్లోనూ డిఫెండింగ్ చాంపియన్లుగా ఉన్న భారత్.. వరుసగా రెండో స్వర్ణం కోసం బరిలోకి దిగనుంది. మహిళల విభాగం మ్యాచ్‌లు సెప్టెంబర్ 17-22 మధ్య, పురుషుల కేటగిరీలో సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 1 దాకా జరుగుతాయి.
అబ్బాయిల విభాగంలో పది జట్లు బరిలో ఉండగా భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ క్వార్టర్స్‌కు క్వాలిఫై అవగా అఫ్గానిస్థాన్, జపాన్, నేపాల్ (గ్రూప్-ఏ), హాంకాంగ్, చైనా, మలేషియా (గ్రూప్-బీ) గ్రూప్ దశ మ్యాచ్‌లు ఆడతాయి. దాయాదుల పోరు సెమీస్‌లో ఉండే అవకాశముంది. అమ్మాయిల విషయానికొస్తే 8 జట్లూ (భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, జపాన్, చైనా, మలేషియా, థాయ్‌లాండ్) క్వార్టర్స్‌కు క్వాలిఫై అయ్యాయి.