శివ్వంపేట, ఫిబ్రవరి 19 : దేశానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆదర్శమని, ఆయన చివరి రక్తం బొట్టు వరకు హిందూ సమాజం కోసం పరితపించిన మహోన్నత వ్యక్తి అని ఎమ్మె ల్యే మదన్‌రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. శనివారం చండీ గ్రామంలో శివాజీయూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహన్ని సర్పంచ్ ఉమా అనిల్ప్రసాద్రెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఘోరిల్లా యుద్ధాన్ని ప్రపంచానికి చాటిన వీరుడు
కొల్చారం : ఘోరిల్లా యుద్ధాన్ని ప్రపంచానికి చాటిన వీరుడు ఛత్రపతి శివాజీ అని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునీతారెడ్డి అన్నారు. కొల్చారం మండల పరిధిలోని పైతరలో శనివారం బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహన్ని ఎమ్మెల్యే మదన్‌రెడ్డితో కలిసి ఆవిష్కరించారు.
ఘనంగా శివాజీ జయంతి..
మెదక్‌రూరల్ : మెదక్ మండల పరిధిలోని మాచవరంలో శనివారం ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా యువజన సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
దేశంలో హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి..
చేగుంట : దేశంలో హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు అయ్యవారి ఆంరు. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా చేగుంట, నార్సింగి మండల కేంద్రం తో పాటు పలు గ్రామాల్లో విశ్వహిందూపరిషత్, బజరంగ్దళ్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.
అల్లాదుర్గంలో..
అల్లాదుర్గం : మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో శివా జీ జయంతిని జరుపుకున్నారు. అల్లాదుర్గం ఐబీ చౌరస్తా నుంచి ప్రధాన వీధుల గుండా శోభాయాత్రను నిర్వహించి శివాజీ చిత్రపటానికి పూలమాల వేసి జెండాను ఎగరవేశారు.
హవేళీఘనపూర్‌లో..
హవేళీఘనపూర్ : మండల పరిధిలోని నాగాపూర్ గ్రామం లో ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకొని గ్రామ శివాజీయూత్ సభ్యులు పూలమాల వేసి నివాళులర్పించారు.
పేటలో శివాజీ శోభాయాత్ర
పెద్ద శంకరంపేట : ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకు పేటలో శోభాయాత్ర చేపట్టగా డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, ఎంపీపీ జంగం శ్రీనివాస్, జడ్పీటీసీ విజయరామరాజు పాల్గొని యాత్రను విజయవంతం చేశారు. దీంతో పాటు మండల పరిధిలోని రామోజీపల్లి, ఆరెపల్లి, మూసాపేట గ్రామాల్లో శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఆయన చేసిన సేవలను కొనియాడారు. పేట రామాలయం నుంచి పాతబస్టాండ్, గాంధీ చౌరస్తా మీదుగా ర్యాలీ తీశారు. కార్యక్రమంలో సర్పంచ్ సత్యనారాయణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మురళీపంతులు పాల్గొన్నారు.
మండల వ్యాప్తంగా..
కొల్చారం : కొల్చారం మండల వ్యాప్తంగా ఛత్రపతి శివాజీ జయంతిని నిర్వహించారు. మండల కేంద్రమైన కొల్చారంలో ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో శివాజీ చిత్రపటానికి పూలమాల వేసి, ద్విచక్ర వాహనాలపై ప్రధాన వీధులగుండా శోభాయాత్ర చేపట్టారు. అలాగే చిన్నాఘన్‌పూర్, సంగాయిపేట గ్రామాల్లో శివాజీ విగ్రహల వద్ద పలువురు ప్రజాప్రతినిధులు పూలమాల వేసి నివాళులర్పించారు.
శివాజీ విగ్రహంతో బైక్‌ర్యాలీ..
రామాయంపేట/రూరల్ : రామాయంపేట పట్టణంలోని శివాజీ జయంతి ఘనంగా జరిగింది. శనివారం ఛత్రపతి శివాజీ యూత్, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తాలో ఉన్న శివాజీ విగ్రహానికి స్థానిక యూత్ నాయకులు, వీహెచ్‌పీ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలోని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బైక్‌ర్యాలీ చేపట్టారు. మండల పరిధిలోని దామరచెర్వు, అక్కన్నపేట, ఝన్సీలింగాపూర్, తొనిగండ్ల, లక్ష్మాపూర్, కాట్రియాల, దంతేపల్లి గ్రామాల్లో శివాజీ జయంతి నిర్వహించారు.
మనోహరాబాద్‌లో..
మనోహరాబాద్ : తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లో ఛత్రపతి శివాజీ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. మనోహరాబాద్ మండలంలోని గౌతోజిగూడెంలో శివాజీ మహారాజ్ విగ్రహ ఏర్పాటుకు జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్ భూమిపూజ చేశారు. మండలంలోని తుపాకులపల్లి, తూప్రాన్ మండలంలోని కిష్టాపూర్, తదితర గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు.
నిజాంపేటలో..
నిజాంపేట : మండల కేంద్రంతో పాటు నందిగామ, నస్కల్, నగరం, తిప్పనగుల్ల, నందగోకుల్ తదితర గ్రామాల్లో ఛత్రపతి శివాజీ జయంతి నిర్వహించారు. నిజాంపేటలో వీ.హెచ్.పీ భజరంగ్‌దళ్ సభ్యులు శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, పాలాభిషేకం చేశా రు. అనంతరం వారు గ్రామంలో బైక్ ర్యాలీ తీశారు.
రేగోడ్ మండలంలో..
రేగోడ్ : మండలంలోని ఆయా గ్రామాల్లో ఛత్రపతి శివాజీ జయంతి నిర్వహించారు. ప్యారారం, చౌదర్పల్లి, తాటిపల్లి, ఆర్ ఇటిక్యాల్, దోసపల్లి గ్రామాల్లో యూత్ సభ్యుల ఆధ్వర్యంలో జరిపారు.
వెల్దుర్తి మండలం వ్యాప్తంగా..
వెల్దుర్తి : ఛత్రపతి శివాజీ జయంతి శనివారం ఉమ్మడి వెల్దుర్తి మండలం వ్యాప్తంగా హిందూ సోదరులు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రాలైన వెల్దుర్తి, మాసాయిపేటతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో శివాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుకునూర్‌లో శివాజీ యూత్ సభ్యులు శివాజీ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. వెల్దుర్తిలో హిందూవాహిని యువసేన సభ్యులు వెల్దుర్తి పట్టణంలో ర్యాలీ తీశారు. మాసాయిపేటలో శివాజీ యువసేన ఆధ్వర్యంలో శివాజీ చిత్రపటానికి నివాళులర్పించి ర్యాలీ చేపట్టారు.
ఘనంగా శివాజీ మహారాజ్ జయంతి..
చిలిపిచెడ్ : మండలంలోని చిట్కుల్, అజ్జమర్రి గ్రామాల్లో చిలిపిచెడ్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు శివాజీ మహారాజ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ఆయా గ్రామ యువకులు శివాజీ మహారాజ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.