సిద్దిపేట, నవంబర్ 3: ఇటీవల వికారాబాద్‌లో జరిగిన 68వ రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ తైక్వాండో పోటీల్లో సిద్దిపేట జిల్లా తైక్వాండో అసోసియేషన్ క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. అండర్-14 విభాగంలో పి.పురంధర అండర్ 20 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్, ఎం.పునీత్‌రెడ్డి అండర్-29 కేజీల విభాగంలో సిల్వర్, ఈ.నిశాంత్ అండర్-32 కేజీల విభాగంలో సిల్వర్ మెడల్, టి.తనీష్ వినయ్ అండర్-41 కేజీల విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించారు.
మెడల్స్ సాధించిన విద్యార్థులను మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హ రీశ్‌రావు అభినందించారు. గోల్డ్ మెడల్ సాధించిన పి.పురంధర్ ఈనెల 8 నుంచి 12 వరకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని విదిశలో జరిగే 68వ జాతీయస్థాయి ఎస్జీఎఫ్, తైక్వాండో పోటీలకు ఎంపికా కా వడంతో హరీశ్‌రావు అభినందించారు. క్రీడాకారులకు తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, సీనియర్ నాయకులు మారెడ్డి రవీందర్‌రెడ్డి, పాల సాయిరాం, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, సిద్దిపేట జిల్లా తైక్వాండో కార్యదర్శి రాచకొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.