పటాన్చెరు, జనవరి 2 : ఆధ్యాత్మిక కేంద్రంగా గణేశ్ గడ్డ దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలోని శ్రీ సిద్ధి గణపతి దేవాలయాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు దర్శించుకున్నారు. స్వాములవారిని దర్శించుకుని ప్రత్యే క పూజలు చేశారు. ఈ సందర్భంగా వేదపండితులు ఎమ్మెల్యే దంపతులను ఆశీర్వదించారు. పూజల అనంతరం ఎమ్మెల్యే సిద్ధి గణపతి దేవస్థానాన్ని అభివృద్ధి చేసేందుకు రూ. 1. 50 కోట్ల సొంత నిధులతో మూడు రోజ గోపురాలు నిర్మించేందుకు శంకుస్థాపనలు చేశారు.
ఎంతో ప్రాశస్త్యం పొందిన సిద్ధి గణపతి దేవాలయానిన దశలవారీగా అభివృద్ధి పరుస్తున్నామని తెలిపారు. ఇప్పటికే రూ. 50లక్షల సొంత నిధులతో అయ్యప్ప, శివ, ఆంజనేయ స్వామి భక్తుల కోసం ధ్యాన మందిరం నిర్మించేందుకు కృషి చేసినట్లు గుర్తు చేశారు. భక్తులకు మెరుగైన వసతులను కల్పించడంతో పాటు ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్‌యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్‌కుమార్, జడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి, సర్పంచ్ సుధీర్‌రెడ్డి, ఎంపీటీసీ మన్నెరాజు,మాజీ ఎంపీపీ శ్రీశైలంయాదవ్, మాజీ సర్పంచ్ వెంకన్న, బీఆర్ఎస్ నాయకులు దశరథరెడ్డి, వెంకట్‌రెడ్డి, మాణిక్‌రెడ్డి, రాజు, మండలాధ్యక్షుడు బీ పాండు, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ నర్సింహారెడ్డి, కార్యదర్శి మోహన్‌రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.