రామాయంపేట,మే 01 : ద్విచక్ర వాహనాలను నడిపే వారు కచ్చితంగా హెల్మెట్లను ధరించాలని రామాయంపేట ఎస్ఐ బాలరాజు పేర్కొన్నారు. గురువారం పట్టణ శివారులో వాహనాల తనిఖీల్లో భాగంగా హెల్మెట్లు లేకుండా ద్విచక్ర వాహనాల నడిపేవారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం ఎస్ఐ బాలరాజు మాట్లాడుతూ కొంత మంది వాహనదారులు హెల్మెట్ ఉన్నా ఇంటి వద్ద పెట్టివచ్చామంటు బుకాయింపులు చేయడం మానుకోవాలన్నారు.
వాహనాలకు సంబంధించిన పేపర్లు లేకుంటే కేసులు నమోదు చేయడమే కాకుండా చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆటోలను నడిపేవారు సామార్థ్యానికి మించి ప్రయాణికులను చేరవేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.