సంగారెడ్డి, అక్టోబర్ 30: సంగారెడ్డి నియోజకవర్గం సదాశివపేట పట్టణానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు శివరాజ్ పాటిల్ ఆ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చారు. సోమవారం నారాయణఖేడ్ సీఎం కేసీఆర్ సభలో బీఆర్ఎస్లో చేరాడు. ఆయనతోపాటు బీజేపీ కో-కన్వీనర్ సత్యనారాయణ, యూత్ కాంగ్రెస్ ప్రభుగౌడ్, బీజేపీ మైనార్టీ మోర్చ మండలాధ్యక్షుడు సయ్యద్ జలీల్ బీఆర్ఎస్లో చేరారు.
సీఎం కేసీఆర్ శివరాజ్ పాటిల్‌ను గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీలో క్రియాశీల నాయకుడిగా పేరున్న పాటిల్ టికెట్ ఆశించి భంగపడ్డారు. ప్రస్తుతం పాటిల్ భార్య సదాశివపేట మున్సిపల్ కౌన్సిలర్‌గా కొనసాగుతున్నారు. సంగారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ గెలుపు కోసం కృషి చేసి, గులాబీ జెండా ఎగురవేస్తామని శివరాజ్ పాటిల్‌తో పాటు బీఆర్ఎస్లో చేరిన నాయకులు ధీమా వ్యక్తం చేశారు.