శివ్వంపేట, డిసెంబర్ 19 : మండల కేంద్రలోని శ్రీబగలాముఖి శక్తిపీఠం చుట్టూ ప్రహరీని త్వరలోనే పూర్తి చేస్తామని బగలాముఖి శక్తిపీఠం చైర్మన్, అమ్మవారి ఉపాసకులు శాస్ర్తుల వెంకటేశ్వరశర్మ, శక్తిపీఠం స్థలదాత పబ్బరమేశ్గుప్తాలు అన్నారు. మంగళవారం వారు ప్రహరీ నిర్మాణానికి ట్రస్టు సభ్యులతో కలసి భూమిపూజ చేశారు. కార్యక్రమంలో శాస్ర్తుల పురుషోత్తంశర్మ, అర్చకులు సంతోశ్‌శర్మ, ప్రసాద్ చారిటబుల్ ట్రస్టు సభ్యుడు సూర్యం కుమార్‌గౌడ్ పాల్గొన్నారు.