పాపన్నపేట, సెప్టెంబర్ 15 : మెదక్ జిల్లా పాపన్నపేట మండల కేంద్రమైన పాపన్నపేట ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మూడు రోజులపాటు జరగనున్న ఎస్జీఎఫ్ క్రీడలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వీటిని స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించగా, స్థానిక సర్పంచ్ పావని నరేందర్ గౌడ్, తాసిల్దార్ సతీష్ ఎంపీడీవో విష్ణు, మండల విద్యాధికారి ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కబడ్డీ, కోకో , వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నారు.
మండల పరిధిలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు భారీ సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనగా పాపన్నపేటకు చెందిన అడ్వకేట్ స్వర్గీయ చింతల వెంకటేశం సతీమణి బహుమతులు బహుకరించారు. క్రీడాకారులకు అవసరమైన ఇతర సామాగ్రిని మల్లంపేట గ్రామానికి చెందిన సాయినాథ్ రావు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశం, పిడి లు రమేష్,నరేష్, భట్టు రేణుక, రాజేందర్, భూపేందర్,మహిపాల్, ప్రసాద్ తో పాటు ఉపాధ్యాయులు అంజా గౌడ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.