Smriti Mandhana : భారత మహిళల క్రికెట్లో నవశకం మొదలైంది. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీ నుంచి వైదొలగడంతో ఆమె స్థానంలో ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) నాయకిగా ఎంపికైంది. స్వదేశంలో జింబాబ్వేతో వైట్‌బాల్ సిరీస్‌కు మంధానను సారథిగా ఎంపిక చేశారు సెలెక్టర్లు. వన్డేలతో పాటు టీ20లకు కెప్టెన్‌గా ఆమెను ప్రకటిస్తూ పటిష్టమైన స్క్వాడ్‌ను వెల్లడించారు. దాంతో.. ఈ సిరీస్ ముందు వరకూ వైస్ కెప్టెన్‌గా కొనసాగిన మంధాన ఇకపై పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనుంది.
మహిళా క్రికెట్లో స్మృతి మంధాన శకం షురూ అయింది. వెటరన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వారసురాలిగా స్మృతి మంధాన కెప్టెన్సీ చేపట్టింది. ఆసియా క్రీడల్లో వరసగా రెండో స్వర్ణం అందించిన హర్మన్.. స్వచ్ఛందంగా నాయకి పాత్రను వదులుకోగా ఆమె స్థానంలో మంధాన ఎంపికైంది.
మంగళవారం జింబాబ్వే సిరీస్‌కు స్క్వాడ్‌ను ప్రకటించిన సెలెక్టర్లు ఈ ఓపెనర్‌ను సారథిగా అనౌన్స్ చేశారు. సీనియర్ దీప్తి శర్మకు వన్డే వైస్ కెప్టెన్‌గా.. ఓపెనర్ షఫాలీ వర్మకు టీ20 వైస్ కెప్టెన్‌గా అవకాశమిచ్చారు. ఇకపై ప్లేయర్‌గానే కొనసాగనున్న హర్మన్‌ప్రీత్ వన్డే, టీ20 స్క్వాడ్లలోనూ చోటు దక్కించుకుంది. అక్టోబర్ 16 నుంచి భారత్, జింబాబ్వే మధ్య పొట్టి సిరీస్ జరుగనుంది.
🚨 News 🚨
Here’s #TeamIndia women’s T20I and ODI squads under Smriti Mandhana’s first series as full-time captain 👏
More Details ▶️ https://t.co/jW53GaoweG
#INDvZIM | @mflone_ | @mandhana_smriti https://t.co/4zOhFgDO7h
— BCCI Women (@BCCIWomen) October 6, 2026
భారత వన్డే స్క్వాడ్: స్మృతి మంధాన(కెప్టెన్), షఫాలీ వర్మ, ప్రతికా రావల్, హర్మన్‌ప్రీత్ కౌర్, హర్లీన్ డియోల్, తేజల్ హసబ్నిస్, దీప్తి శర్మ(వైస్ కెప్టెన్), యస్తికా భాటియా(వికెట్ కీపర్), రీచా ఘోష్(వికెట్ కీపర్), వైష్ణవి శర్మ, నందిని శర్మ, శ్రీ చరణి, క్రాంతి గౌడ్, సయాలీ సత్ఘరే, రేణుకా ఠాకూర్.
భారత టీ20 స్క్వాడ్: స్మృతి మంధాన(కెప్టెన్), షఫాలీ వర్మ(వైస్ కెప్టెన్), నికీ ప్రసాద్, హర్మన్‌ప్రీత్ కౌర్, అనుష్క శర్మ, రీచా ఘోష్(వికెట్ కీపర్), జి.కమలిని(వికెట్ కీపర్), దీప్తి శర్మ, ప్రేమా రావత్, నందిని శర్మ, శ్రీ చరణి, క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, మిన్ను మణి, జింతిమణి కలిత.