Maynampally Rohit : కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ (Maynampally Rohit) ఆర్టీవీ కార్యాలయంపై దాడికి ప్రయత్నించారు. భూ కబ్జాలపై ప్రత్యేక వార్తా కథనాలు ప్రసారం చేయడంతో ఆగ్రహించిన ఆయన మంగళవారం తన అనుచరులతో కలిసి ఆర్టీవీపై దాడికి యత్నించారు.
మైనంపల్లి భూ కబ్జాలపై ఆర్టీవీ ప్రత్యేక కథనాలు ప్రసారం చేయడంతో ఎమ్మెల్యే రోహిత్ దాడికి యత్నించారు. మంగళవారం రాత్రి జూబ్లిహిల్స్ సీబీఐ కాలనీలోని ఆర్టీవీ కార్యాలయానికి వచ్చిన ఆయన విధ్వంసానికి పాల్పడాలనుకున్నారు. అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులను లెక్కచేయని మైనంపల్లి వారితో వాగ్వాదానికి దిగారు. అంతేకాదు పోలీసులపై ఆయన తిరగబడ్డారు. దాంతో, ఆర్టీవీ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఆర్ టీవీ కార్యాలయంపై దాడి చేయడానికి యత్నించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
భూ కబ్జాలపై ఆర్ టీవీ ప్రత్యేక వార్తా కథనాలు ప్రసారం చేయడంతో దాడికి యత్నం
అడ్డుకున్న పోలీసులు.. పోలీసులపై తిరగబడ్డ మైనంపల్లి రోహిత్ https://t.co/80jHhpy6i2
— Telugu Scribe (@TeluguScribe) October 6, 2026