IND vs WI : వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టీ20లో ఓపెనర్లు విఫలమయ్యారు. పవర్ ప్లేలోనే అభిషేక్ శర్మ(21), సంజూ శాంసన్(11)లు పెవిలియన్ చేరడంతో కష్టాల్లో పడిన టీమిండియాను కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(50 నాటౌట్) ఆదుకున్నాడు. పొట్టి క్రికెట్లో 11వ అర్ధ శతకం సాధించాడు. దాంతో.. పది ఓవర్లకు స్కోర్ వంద దాటింది.
లక్నోలోని ఎకానా స్టేడియంలో జరుగుతున్న తొలి టీ20లో భారత్‌కు శుభారంభం దక్కలే. 172 పరుగుల ఛేదనలో ఫామ్‌లో ఉన్న ఓపెనర్ అభిషేక్ శర్మ(21)ను రోస్టన్ ఛేజ్ ఔట్ చేయగా.. అకీల్ హొసేన్ ఓవర్లో సంజూ శాంసన్(11) అతడికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. పవర్ ప్లేలో.. రెండు కీలక వికెట్లు పడిన వేళ ఇషాన్ కిషన్(25 నాటౌట్), కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(50 నాటౌట్)లు నిలబడ్డారు. వెస్టిండీస్ స్పిన్నర్లను దీటుగా ఎదుర్కొన్న ఈ ద్వయం జట్టును గెలిపించే బాధ్యత తీసుకుంది. కాస్త కుదురుకున్నాక వీరిద్దరూ బౌండరీలతో అలరిస్తూ అర్ధ శతకం భాగస్వామ్యం నెలకొల్పారు. దాంతో.. పది ఓవర్లు స్కోర్..102-2.
A masterful 1️⃣1️⃣th T20I fifty 👏
Captain Shreyas Iyer leading from the front 💙
Updates ▶️ https://t.co/2czVyKWreK
#TeamIndia | #INDvWI | @mflone_ | @ShreyasIyer15 https://t.co/d3ahH6L7uR
— BCCI (@BCCI) October 6, 2026