నర్సాపూర్,సెప్టెంబర్14: మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో డెంగ్యూతో ఏడేండ్ల చిన్నారి శనివారం మృతి చెందింది. నర్సాపూర్ మున్సిపాలిటీ శివాలయం సమీపంలో నివసిస్తున్న జింకల నర్సింగ్, లహరి దంపతులకు ఏడేండ్ల బాలిక సహస్ర సంతానం. ఆ చిన్నారి నర్సాపూర్‌లోని డాన్‌బాస్కో ప్రైవేట్ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నది.
మూడు రోజులుగా జ్వరంతో అనారోగ్యానికి గురికావడంతో నర్సాపూర్ దవాఖానలో వైద్యం అందించారు. శనివారం ఉదయం పాఠశాలకు వెళ్లిన చిన్నారి సహస్ర అక్కడ సొమ్మసిల్లి పడిపోయింది. హుటాహుటిన హైదరాబాద్‌లోని ప్రైవేట్ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ విషమించి మృత్యువాత చెందింది. ప్లేట్లెట్స్ పడిపోయి డెంగ్యూతో మరణించిందని కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపారు.