మెదక్, జూలై 11 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో గురువా రం రిజిస్ట్రేషన్లు స్తంభించిపోయాయి. సర్వర్ పనిచేయకపోవడంతో లావాదేవీలను ఆపేశారు. రెండు రోజులుగా నామమాత్రంగానే రిజిస్ట్రేషన్లు జరిగాయి. దీంతో కోట్లాది రూపాయల లావాదేవీలు నిలిచిపోయాయి. మెదక్ జిల్లాలో నాలుగు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. అందులో మెదక్, తూప్రాన్, నర్సాపూర్, రామాయంపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రతిరోజూ 10 నుంచి 20 రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. సాంకేతిక లోపం తలెత్తడంతో రిజిస్టేషన్ కార్యాలయాల్లో రిజిస్టేషన్ ప్రక్రియకు బ్రేక్ పడింది. దీంతో ఉద యం నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల దగ్గర జనం పడిగాపులు కాశారు. సాంకేతిక సమస్యను వెంటనే పరిషరించాలని డిమాండ్ చేశారు. దాదా పు జిల్లాలోని అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆధార్ వెరిఫికేషన్ ఆగిపోవడంతో 10 నుంచి 20 డాక్యుమెంట్లు ఆగిపోయా యి. ఉద్యోగాలకు, ఇతర పనులను వదిలిపెట్టి మరి ఉదయం నుంచి రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ కోసం వేచి చూస్తున్నామని క్రయ విక్రయదారులు చెప్పారు.