అమీన్పూర్, డిసెంబర్ 9 : చెరువులు, కుంటల స్థలాలను అక్రమిస్తే చర్యలు తప్పవని సంగారెడ్డి ఇరిగేషన్ ఎస్ఈ మధుసూన్రెడ్డి హెచ్చరించారు. మున్సిపల్లోని పెద్దచెరువును కొందరు మట్టితో పూడ్చి ఆక్రమణలకు పాల్పడినట్లు తెలుసుకుని శుక్రవారం చెరువును సందర్శించారు.
కొత్తచెరువులో మట్టితో పూడ్చిన స్థలాన్ని చూశారు. చెరువులు, కుంటల స్థలాలను బహిరంగంగా ఆక్రమిస్తుంటే స్థానిక ఇరిగేషన్ అధికారులు ఏమి చేస్తున్నారని?, దీనిపై డీఈ మురళీధర్, ఏఈ ప్రసాద్ వివరణ ఇవ్వాలని అదేశించారు. చెరువు స్థలంలో మట్టి పోసినవారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎఫ్టీఎల్ పట్టాదారులైన పలువురుపై కేసు న మోదు చేసినట్లు తెలిపారు. ఆయన వెంట డీఈ మురళీధర్ ఉన్నారు.