చిలిపిచేడ్, జూన్ 24: గతేడాదిగా గ్రామాల్లో అధికారుల పాలన కొనసాగుతున్నది. కానీ మండలంలోని పలు గ్రామాల్లో మురుగు కాలువ శుభ్రం చేసే వారు కరువు అయ్యారు. చిలిపిచేడ్ మండలంలోని గౌతాపూర్, చండూర్, చిట్కుల్, గంగారం, ఫైజాబాద్, అజ్జమర్రి, సోమక్కపేట, గంగిఎద్దుల గూడం ఆయా గ్రామంలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలనలో ఎటు చూసినా వీధులు, పాఠశాలలు అపరిశుభ్రంగా దర్శనస్తున్నాయి. గౌతాపూర్ బీసీ కాలనీలో మంచి నీటి మోటర్ ప్రక్కన పారిశుధ్యం అధ్వానంగా తయారైంది. మురుగు నీరుతో కంపు కొడుతున్నదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో మురుగు కాల్వలు పేరుకుపోయిన చెత్తాచెదారం పట్టించుకొని అధికారలు. మురుగు కాలవలో నీటిలో ప్లాస్టిక్ గ్లాసులు, డబ్బాలు, ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతున్నది. మురుగుకాలువలను శుభ్రం చేయడంలో అధికారులు చిత్తశుద్ధి కరువైంది.
మండలంలోని సోమక్కపేట, చండూర్, అజ్జమర్రి, శీలాంపల్లి, జగ్గంపేట, రహీంగూడ తండా, టోప్యి తండా,గన్య తండా గ్రామాల్లో మురుగు కాలువలు అధ్వానంగా తయారయ్యాయి.ఎక్కడ చూసిన చెత్తతో నిండిపోయికంపు కొడుతున్నాయి. దోమలు, ఈగలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడడంతో పాటు రోగాల బారిన పడుతున్నారు. కానీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పంటికైన అధికారులు గ్రామాల్లో పర్యవేక్షించి చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.