కల్హేర్, జూన్ 10: సంగారెడ్డి జిల్లా కల్హేర్లో (Kalehar) ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ఈదురు గాలుల ధాటికి రోడ్డు పక్కన ఉన్న చెట్లు నోలకూలాయి. దీంతో రోడ్డుపై అడ్డంగా చెట్లు పడిపోవడంతో మాసాన్ పల్లి, కల్హేర్కు రాకపోకలు నిలిచిపోయాయి. ఈనేపథ్యంలో బైకులు, ఆటోలు, కార్లు, ట్రాక్టర్లు తిరుగలేని పరిస్థితి నెలకొంది. రోడ్డుకి అడ్డంగా కూలిపోయినచెట్లను తొలగించి రాకపోకలకు మార్గం సుగమం చేయగలరని వాహనదారులు అధికారులను కోరుతున్నారు.