Ward members | జహీరాబాద్, మార్చి 23 : గ్రామీణాభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకమని న్యాల్కల్ మండల అభివృద్ధి అధికారి నరేష్ కుమార్ అన్నారు. నూతనంగా ఎన్నికైన మండలంలోని గ్రామపంచాయతీ వార్డు సభ్యులకు 5 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం మండల కేంద్రమైన న్యాల్కల్ ఎంపీడీవో కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వార్డుమెంబర్లకు పంచాయతీరాజ్ వ్యవస్థ కీలకమైన బాధ్యతలు కట్టబెట్టిందన్నారు. వార్డుల్లో సమస్యలు గుర్తించి పరిష్కరించడంలో చురుగ్గా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరేలా కృషి చేయాలన్నారు.
పంచాయతీరాజ్ చట్టం, గ్రామసభల నిర్వహణ, ఆర్థిక వ్యవహారాలు, అభివృద్ధి పథకాల అమలు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలపై వార్డు సభ్యులకు మాస్టర్ ట్రైనర్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. వార్డు సభ్యులు శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో మండల పంచాయతీ అధికారి సౌజన్య తదితరులు పాల్గొన్నారు.
Mangli | మైక్రో ఫైనాన్స్ మోసాలపై సింగర్ మంగ్లీ క్లారిటీ.. నా పేరుతో డబ్బులు వసూలు చేస్తే నమ్మోద్దు..