సంగారెడ్డి : నిజామాబాద్ ఎంపీ అరవింద్‌పై టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అరవింద్ వ్యాఖ్యలకు
నిరసనగా జహీరాబాద్ పట్టణంలో జాతీయ రహదారిపై అరవింద్ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఎంపీ అరవింద్ తన పద్ధతి మార్చుకోకపోతే ప్రజల నుంచి గుణపాఠం తప్పదన్నారు. అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని టీఆర్ఎస్ శ్రేణులు హెచ్చరించాయి.