త్వరలో 50వేల ఉద్యోగాల భర్తీ
రైతుకు భద్రత లేకుండా చేసిన బీజేపీ ప్రభుత్వం
రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు
చింతమడకలో అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి
సిద్దిపేట అర్బన్, ఫిబ్రవరి 3 : ప్రభుత్వరంగ సంస్థలు అన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తూ, కార్పొరేట్లకు అగ్గువకు కట్టబెడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లు లేకుండా చేస్తున్నదని ఆర్థి క, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రా వు ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు లేకుండా చేసి ఎస్సీ, ఎస్టీల పొట్టకొట్టేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు కుట్ర పన్నుతోందని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. గురువారం సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామంలో 164 మంది డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులతో ఆయన సామూహిక గృహప్రవేశాలు చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలు అన్నింటినీ ప్రైవేటు పరం చేస్తున్నదన్నారు. జాతి సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్నదన్నారు. రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, ఎస్సీ, ఎస్టీలు, మహిళల హక్కుల కోసమే సీఎం రాజ్యాంగం గురించి మాట్లాడారన్నారు. బీజేపీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోగా, ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతోందని ఆరోపించారు. రైతులకు ఇచ్చే అన్ని సబ్సిడీలు తగ్గించి, ఎరువుల ధరలను పెంచి వారికి భద్రత లేకుండా చేసిందన్నారు. త్వరలోనే పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేస్తామని మంత్రి
పేర్కొన్నారు.
ఎస్సీ, ఎస్టీల పొట్టకొడుతున్న బీజేపీ అన్నారు. గురువారం సిద్దిపేట రూరల్ మండ లం చింతమడక గ్రామ ఎస్సీ కాలనీలో 164 డ బుల్ బెడ్రూం ఇండ్ల సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అంతకు ముందు చింతమడకలో దమ్మచెరువు నుంచి న ర్రెంగలగడ్డ వరకు, చింతమడక నుంచి రాఘవాపూర్ వరకు, చింతమడక నుంచి చెల్లాపూర్-రాజక్కపేట వరకు బీటీ రోడ్డు పనులకు మంత్రి శం కుస్థాపన చేశారు. గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిచారు. ఈ సం దర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. సో షల్ మీడియాలో బీజేపీ చేసే దుష్ప్రచారాన్ని న మ్మవద్దని, యువత వాటిని తిప్పికొట్టి నిజాన్ని గ్ర హించాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ రా జ్యాంగంలో కొంత మార్పులు తేవాల్సి ఉందని మాట్లాడితే, కొంతమంది అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగ పరమైన హక్కులు సంక్రమించేందుకే రాజ్యాంగాన్ని మార్చాలని సీఎం కేసీఆర్ మాట్లాడారన్నారు. దేశంలో 25 కోట్ల మంది దళితులు ఉంటే, కేవలం రూ.8 వేల కోట్ల బడ్జెట్ పెట్ట డం సరికాదన్నారు. తాను రాసిన రాజ్యాంగం అమలు కాకపోతే తానే కాలపెడతానని ఒక సందర్భంలో రాజ్యసభలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అన్న మాటలను ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ఐసీ, రైల్వే, బీఎస్ఎన్ఎల్, బీడీఎల్, బ్యాంకులను అమ్మి ప్రైవేటు పరం చేస్తే, అందులో పేదలకు, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు రిజర్వేషన్లు వర్తిస్తాయా అని ప్రశ్నించారు. పులుల నుంచి మేకల్ని కాపాడాలని అంబేద్కర్ చెప్పారని.. కానీ, నేడు ప్రభు త్వ రంగ సంస్థలను ప్రైవేటు వారి చేతిలో పెడితే వారు రిజర్వేషన్ ఇస్తారా అని మంత్రి ప్రశ్నించా రు. పెరిగిన జనాభా ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు నిధులు కేటాయించేందుకే సీఎం కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలని మీడియా సమావేశంలో చెప్పారన్నారు. ఆదానీ, అంబానీలకు అన్ని కంపెనీలు పోతే, అందులో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఉం టాయా.. అని మంత్రి ప్రశ్నించారు. బీజేపీ ప్రభు త్వం ఉద్యోగాలు ఇవ్వకపోగా, ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతందన్నారు.
రైతుల నడ్డి విరుస్తున్న బీజేపీ సర్కారు..
రైతులకు ఇచ్చే అన్ని సబ్సిడీలు తగ్గించి, ఎరువుల ధరలను పెంచి రైతులకు బీజేపీ ప్రభుత్వం భద్రత లేకుండా చేసిందని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఐదు రాష్ర్టాల ఎన్నికల తర్వాత పెట్రో, డీజిల్ ధరలు మళ్లీ కేంద్ర ప్రభుత్వం పెంచుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతు ను కాపాడే ప్రయత్నం చేస్తుంటే, బీజేపీ ప్రభు త్వం రైతును ముంచే ప్రయత్నం చేస్తున్నదని మం త్రి ధ్వజమెత్తారు. దీనిని ప్రజలు ఆలోచించాలన్నారు. బడ్జెట్లో ఎఫ్ఆర్బీఎం పరిమితి తగ్గించి జీఎస్డీపీలో 4శాతం రుణాన్ని 3.5 శాతానికి త గ్గించిందన్నారు. ఆ అర శాతం తగ్గించి తెలంగాణ కు రావాల్సిన రూ.5 వేల కోట్లను ఇవ్వకుండా.. బాయిల కాడ మీటర్లు పెడితేనే అవి ఇస్తామని మెలిక పెడుతున్నారని ఆరోపించారు. తన గొం తులో ప్రాణం ఉండగా సీఎం కేసీఆర్ బాయిల కాడ మీటర్లు పెట్టనియ్య అని చెప్పారన్నారు. మీటర్లు వద్దు.. బీజేపీ వద్దు.. మన కేసీఆరే మనకు ముద్దన్నారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పై కక్ష గట్టిందన్నారు. హైదరాబాద్ నుంచి కరీంగనర్‌కు వెళ్లే రైల్వేలైన్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు ఇచ్చి భూసేకరణ చేస్తే, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కేవలం రూ.60 కోట్లు ఇచ్చి మోసం చేసిందన్నారు. బట్టెబాజ్.. జూటే బాజ్ పార్టీ బీజేపీ అని.. వారు సోషల్ మీడియాలో చేసే దుష్ప్రచారాన్ని తెలంగాణ యువత తిప్పికొట్టి వాస్తవాలను గ్రహించాలన్నారు.
కేంద్ర కొలువులు భర్తీ చేయరా…
దేశంలోని అనేక ప్రభుత్వ రంగ సంస్థలో సు మారు 15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని వెంటనే భర్తీ చేయాలని మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఏడు లక్షలు ఖాళీగా ఉ న్నాయని బండి సంజయ్ ఒప్పుకున్నాడని, అవి కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలని, ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని కలిపితే 15 లక్షలు ఖాళీగా ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే లక్షా 32 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, అతి త్వరలోనే 50 నుంచి 60 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మంత్రి ప్రకటించారు. ఇండియాలో రూపాయి ఖర్చు లేకుండా పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ మా త్రమే అన్నారు. గతంలో రూ.400 ఉన్న గ్యాస్ సబ్సిడీ నేడు రూ.40కి తీసుకొచ్చారని చెప్పారు. కోతలు వాతలు తప్ప కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలకు చేసిందేమి లేదన్నారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో అనంతరెడ్డి, జడ్పీటీసీ శ్రీహరిగౌడ్, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, గ్రామ సర్పంచ్ హంసకేతన్‌రెడ్డి, ఉప సర్పంచ్ రవి పాల్గొన్నారు.
.