MLA Koninty Manik Rao | జహీరాబాద్, ఏప్రిల్ 27 : తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ (టీఆర్ఎస్) పాలనలోని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం తిరోగమన దిశలో ప్రయాణిస్తుందని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ 25వ వ్యవస్థాపక దినోత్సవంలో భాగంగా ఇవాళ జహీరాబాద్ పట్టణంలోని ఐబీ గెస్ట్ హౌస్ ఆవరణలో ఎమ్మెల్యే మాణిక్ రావు పార్టీ జెండాను ఆవిష్కరించారు.
అలాగే నియోజకవర్గంలోని ఆయా మండలాల్లోని గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ అధ్యక్షులు జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనతోపాటు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్కు దక్కిందన్నారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు.
రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ పాలనే రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం బాగారెడ్డి స్టేడియంలో వరంగల్ బహిరంగ సభకు పార్టీ శ్రేణులను తరలించే ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులు, వాహనాలను పరిశీలించారు.
జహీరాబాద్ నియోజకవర్గం నుండి భారీగా తరలిన పార్టీ శ్రేణులు..
బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రజతోత్సవ సభకు జహీరాబాద్ నియోజకవర్గం నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు, అభిమానులు భారీ ఎత్తున తరలి వెళ్లారు.
ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని న్యాల్కల్, జహీరాబాద్,కోహీర్ మొగుడంపల్లి, జరాసంఘం మండలాల నుంచి ప్రత్యేక బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా తరలి వెళ్లారు.
ఈ సభకు తరలి వెళ్తున్న పార్టీ శ్రేణులకు ఇలాంటి ఇబ్బందులు కలకుండా భోజన వసతి తాగునీటి సౌకర్యాలను ఏర్పాటు చేశారు. వారిని తిరిగి ఇంటికి క్షేమంగా చేరేలా ఏర్పాట్లను చేశారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ ఈదురుపల్లి శివకుమార్, ఆయా మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, నర్సింలు, సంజీవరెడ్డి రవీందర్, వెంకటేశం, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Giloy | సర్వ రోగ నివారిణి.. తిప్పతీగ.. మన చుట్టూ పరిసరాల్లోనే ఈ మొక్క పెరుగుతుంది..!
Putta Madhukar | మంత్రి పదవి మంథనికి పైస మందం కూడా పనికొస్తలేదు : పుట్ట మధుకర్
BRS | బీఆర్ఎస్ సభకు వెళ్తే ప్రభుత్వ పథకాలు రావని బెదిరిస్తున్నారు : దాసరి మనోహర్ రెడ్డి