Gangula Kamalakar | పటాన్ చెరు, డిసెంబర్ 4 : తెలంగాణ ఆస్తులను, అస్థిత్వాన్ని కాపాడేందుకే బీఆర్ఎస్ పార్టీ పుట్టిందని, హిల్ట్ పాలసీ పేరుతో పరిశ్రమ భూములను ధారాదత్తం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని రాష్ట్ర మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. గురువారం పటాన్ చెరు మండలంలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో పర్యటించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం హిల్ట్ పేరుతో పారిశ్రామిక ప్రాంతాల్లో ఉన్న భూములను అమ్మకం చేసేందుకు కుట్ర చేస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇండస్ట్రియల్ పాలసీ పేరుతో ఐదు లక్షల కుంభకోణం చేసినందుకు ప్రయత్నం చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 27 జారీ జేసి భూములను ఖాళీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పటాన్చెరు, పాశ మైలారం ప్రాంతంలో భూములను అమ్మకం చేసేందుకు ప్రయత్నం చేసిందన్నారు.
పారిశ్రామిక వేతలు స్వచ్ఛందంగా భూములు అమ్ముకోవచ్చని జీవో జారీ చేశారు అన్నారు. పరిశ్రమల కోసం భూములు ఇచ్చిన రైతులకు తిరిగి భూములు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర ఎకరానికి రూ.37 లక్షలు , మార్కెట్లో ఈ భూమి ధర కోట్లలో ఉందన్నారు. ప్రస్తుతం ఇక్కడ ఎకరానికి 20 కోట్లు ధర పలుకుతుందన్నారు. పాశ మైలారం పారిశ్రామిక వాడ ఏర్పాటు కోసం రైతుల నుంచి భూసేకరణ చేశారన్నారు. గతంలో ఎకరానికి రైతులకు రూ.3500 ఇచ్చిందన్నారు.
రైతుల నుంచి తీసుకున్న ఇంతవరకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం ఇవ్వలేదు అన్నారు. ప్రభుత్వం రైతులకు తిరిగి భూములు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల కోసం రైతులు భూములు ఇచ్చారు నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని ఇచ్చిన భూములను అమ్మకం చేస్తే ఎలా అన్నారు. ఇంతవరకు భూములు ఇచ్చిన వారికి ఉద్యోగాలు ఇవ్వలేదని తెలిపారు.
రైతులకు తిరిగి భూములు ఇవ్వాలి:
పరిశ్రమల కోసం భూములిచ్చిన రైతులకు తిరిగి ప్రభుత్వం భూములు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి ఆదాయం కావాలనుకుంటే బహిరంగ వేలం వేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి ఆదాయం జరుగుతుందన్నారు. ముంబై పాలసీని ఇక్కడ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పేదలకు ఇండ్ల స్థలాల కోసం భూములు పంపించాలని డిమాండ్ చేశారు.
జీవోను తిరిగి వెనుక్కు తీసుకోవాలి..
భవిష్యత్తు కోసం పారిశ్రామిక వాడను ఏర్పాటు చేస్తే ఆ భూములు అమ్మేస్తే ఉపాధి పోతుందన్నారు. పరిశ్రమలు తరలిపోతే ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 వేల మందికి నష్టం జరుగుతుందన్నారు. స్వచ్ఛందంగా అమ్ముకునేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం సరికాదన్నారు. నడుస్తున్న పరిశ్రమల భూములను అమ్ముకోవాలని జీవో జారీ చేయడంతో తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. తెలంగాణలో ఉన్న ఫ్యాక్టరీలు అమ్ముకొని పోతే ఒక రాష్ట్రంలో ఒక పరిశ్రమ మిగలదన్నారు.
ఉపాధి కోసం రోడ్ల మీద పడే పరిస్థితి వస్తుందన్నారు. మధ్యవర్తుల లాలూచీ కోసం జీవో జారీ చేశారన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోను తిరిగి వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో సంగారెడ్డి జహీరాబాద్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్ కొనంటి మాణిక్యరావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఉమ్మడి జిల్లా డీసీఎం చైర్మన్ శివకుమార్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, పటాన్చెరు నియోజకవర్గ ఇన్చార్జి ఆదర్శ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు గడిల శ్రీకాంత్ గౌడ్, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, తోపాటు పలువురు పాల్గొన్నారు.



Mahabubabad | లారీని ఢీ కొన్న బైక్.. రైల్వే ఉద్యోగి మృతి
Jyotiraditya Scindia: సంచార్ సాథీ యాప్‌తో స్నూపింగ్ జరగదు: లోక్‌సభలో మంత్రి సింథియా