Bhoot Bangla | థియేటర్లలో బ్లాక్‌బస్టర్.. ఇప్పుడు ఓటీటీలోకి ‘భూత్ బంగ్లా’ , మ్యాజిక్కు మళ్లీ రెడీ అవ్వండి!
Bhoot Bangla | బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన హారర్ కామెడీ మూవీ ‘భూత్ బంగ్లా’ థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న తర్వాత ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. నివేదికల ప్రకారం ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.
Bhoot Bangla | బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన హారర్ కామెడీ మూవీ ‘భూత్ బంగ్లా’ థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న తర్వాత ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. నివేదికల ప్రకారం ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. జూన్ 12 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
‘భూత్ బంగ్లా’ విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడటానికి ప్రధాన కారణం అక్షయ్ కుమార్, దర్శకుడు ప్రియదర్శన్ మళ్లీ కలవడమే. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఈ సక్సెస్ఫుల్ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన కామెడీ ఎంటర్టైనర్లు బాలీవుడ్లో కల్ట్ క్లాసిక్స్‌గా నిలిచాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఈ జోడీకి ప్రత్యేకమైన క్రేజ్ ఉండటంతో ‘భూత్ బంగ్లా’పై కూడా మొదటి నుంచే భారీ హైప్ ఏర్పడింది.
సాధారణంగా హారర్ కామెడీ సినిమాలు ఎక్కువగా జంప్ స్కేర్స్పైనే ఆధారపడుతుంటాయి. కానీ ‘భూత్ బంగ్లా’ మాత్రం ఆ ఫార్ములాకు భిన్నంగా తెరకెక్కింది. అతీంద్రియ శక్తులు, గ్రామీణ జానపద కథలు, ఎమోషనల్ డ్రామా, ప్రియదర్శన్ స్టైల్ కామెడీ అన్నింటినీ కలిపి ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని అందించారు.ఈ సినిమా పాత బాలీవుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ల ఫీలింగ్‌ను గుర్తుచేస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సినిమాలో అక్షయ్ కుమార్ అర్జున్ అనే పాత్రలో కనిపించాడు. లండన్‌లో జీవిస్తున్న అర్జున్.. తన పూర్వీకుల గ్రామానికి తిరిగి వస్తాడు. అక్కడ అతనికి ఒక పాత రాజభవనం వారసత్వంగా దక్కుతుంది. అయితే ఆ గ్రామంలో కొత్త పెళ్లికూతుళ్లను వెంటాడుతున్న ఓ శాపం ఉందని అతనికి తెలుస్తుంది. ‘వధుసుర్’ అనే దుష్టశక్తి పెళ్లికూతుళ్లను బలి కోసం కిడ్నాప్ చేస్తుందనే జానపద కథ గ్రామస్థులను భయభ్రాంతులకు గురిచేస్తూ ఉంటుంది. ఆ తర్వాత అర్జున్ ఆ శాపం వెనుక ఉన్న నిజాన్ని ఎలా బయటపెట్టాడు? తన కుటుంబాన్ని, గ్రామ ప్రజలను ఎలా కాపాడాడు? అన్నదే సినిమా ప్రధాన కథాంశం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

