ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో రైతులు ఆందోళనకు దిగారు. నేతాజీ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
ప్రధాన రహదారిపై ధాన్యం పోసి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్నదాతలు నిరసన తెలిపారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతన్నల ఆందోళనతో ప్రధాన రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయా, రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.