పటాన్ చెరు, సెప్టెంబర్ 11: పాశమైలారం పారిశ్రామిక వాడలో ఉన్న సువెన్ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు యజమాన్యం వెంటనే పరిష్కరించాలని యూనియన్ అధ్యక్షులు కే రాజయ్య డిమాండ్ చేశారు. గురువారం పటాన్ చెరు మండలంలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో ఉన్న సువెన్ ఫార్మా కంపెనీ ముందు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని దీక్షను ప్రారంభించారు. కంపెనీలో గత 15 సంవత్సరాలుగా కార్మికులు పనిచేస్తున్నారని వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మిక చట్టాలకు విరుద్ధంగా యజమానియం వ్యవహరిస్తుందని, సమస్యలు పరిష్కరించకపోతే హైదరాబాద్ లో ఉన్న ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
చట్టాల ప్రకారం కార్మికులను నేరుగా ఉత్పత్తిలో పనిచేయించుకోరాదని కోర్టు డిపార్ట్మెంట్ చేయించుకోరాదని చెప్తున్నప్పటికీ యజమానియం పట్టించుకోవడం లేదన్నారు. కంపెనీలో పని చేస్తున్న కార్మికులందరినీ పర్మినెంట్ చేయకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. కార్మికులందరూ ఐక్యంగా ఉండి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కార్మిక సంఘం యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ మాణిక్ మాట్లాడుతూ యజమానియం మొండి వైఖరి విడనాడి కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు శ్రీనివాస్, రాజు, వెంకటేష్, చంద్రయ్య, అన్నాజీ, శ్రీనివాస్, చంద్రకాంత్, రాములు, సురేఖ, ప్రభు, గంగమణి తదితరులు పాల్గొన్నారు.