Siddeshwara Swamy Jathara | ఝరాసంగం, ఏప్రిల్ 10 : అతి పురాతనమైన పొట్టిపల్లి సిద్దేశ్వర స్వామి జాతర మహోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ మండల పరిధిలోని బర్దిపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో పీఠాధిపతి, మహామండలేశ్వర్ డాక్టర్ మహంత్ సిద్దేశ్వరానందగిరి మహారాజ్ జాతరకు సంబంధించిన వాల్ పోస్టర్ను గ్రామస్తులు, దేవాలయ కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ నెల 11న శిఖర పూజ, ద్వజారోహణం, 12న రుద్రాభిషేకం, పల్లకి సేవ, తాద్లపూర్ దత్తు మహారాజ్తో హరికథ గానకచేరి, 13న అగ్గిగుండం, విశ్వ మానవ ధార్మిక సభ, సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు సిద్దేశ్వరానందగిరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ఆలయం సభ్యులు పాల్గొన్నారు.