ఝరాసంగం, మే2: మండల కేంద్రంలోని షాదీఖానా భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఎంఐఎం మండల అధ్యక్షుడు షేక్ రబ్బాని కోరారు. శుక్రవారం పెండింగ్లో ఉన్న షాదీఖానా భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..షాదీఖానా నూతన భవన నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు రూ.20 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారన్నారు.
అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా షాదీఖానా పనులు పూర్తి చేయకపోవడం దారుణమన్నారు. కక్ష పూరితంగానే గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులను అధికార పార్టీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. షాదీఖానా పనులు పూర్తి కాకపోవడంతో ముస్లింలు పెళ్లిళ్లు చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.