కంది, జూలై 3 : హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను చెట్టుగా ఎదిగే వరకు సంరక్షించాలని ఆర్డీవో మెంచు నగేశ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పల్లె ప్రకృతి వనంతో పాటు కాశీపూర్‌లో ఆయన పర్యటించారు. కార్యక్రమంలో సర్పంచ్ విమల వీరేశం, నాయకులు జావెద్, ఎంపీడీవో విశ్వప్రసాద్, ఎంపీటీసీ నందకిశోర్, పంచాయతీ కార్యదర్శి వాణి తదితరులు పాల్గొన్నారు.
మున్సిపాలిటీలో జోరుగా పట్టణ ప్రగతి
బొల్లారం, జూలై 3 : మున్సిపల్ చైర్పర్సన్ కొలన్ రోజాబాల్రెడ్డి, కమిషనర్ రాజేంద్రకుమార్ 1వ వార్డులో పర్యటించారు. ప్రజా సమస్యలను అడిగితెలుసుకున్నారు. పారిశుధ్య నిర్వహణపై ఆరా తీశారు. వైకుంఠధామాన్ని పరిశీలిం చి మొక్కలు నాటారు. మల్లన్నబస్తీలో 16వ వార్డు కౌన్సిలర్ చంద్రారెడ్డితో కలిసి పర్యావరణ ఇన్స్పెక్టర్ సాయికిరణ్ పాల్గొన్నారు. సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమం లో వార్డు కౌన్సిలర్ చంద్రయ్య, ఆర్వో శ్రీధర్, పర్యావరణ ఇన్స్‌స్పెక్టర్ సాయికిరణ్‌రెడ్డి, నాయకులు రాజు, సంపత్‌రెడ్డి, బాబురావు, రవీందర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
జోరందుకున్న పట్టణ ప్రగతి
సదాశివపేట, జూలై 3 : సదాశివపేట పట్టణంలోని 3,7,12,13,19 వార్డుల్లో మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని ప్రజలను భాగస్వాములు చేశారు. మురుగు కాలువలు శుభ్రం చేశారు. మున్సిపల్ సిబ్బందితో శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహించి బ్లీచింగ్ చేశారు. సమస్యలను తెలుసుకున్నారు. ఇండ్లపై ఉన్న విద్యుత్ తీగలు తొలగించేందుకు ఏర్పాట్లు చేశారు. 12వ వార్డులో ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపల్ కమీషనర్ కృష్ణారెడ్డి మాట్లాడారు. అనంతరం వార్డులో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ పిల్లోడి విశ్వనాథం, పులిమామిడి రాజు, వివిధ వార్డుల కౌన్సిలర్లు, వార్డు ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.
మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు
పటాన్చెరు, జూలై 3 : ఎంపీపీ సుష్మాశ్రీ, జడ్పీటీసీ సుప్రజ ఆధ్వర్యంలో ఇస్నాపూర్, పాశమైలారం, లక్డారం గ్రామాల్లో జరుగుతున్న పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఇస్నాపూర్ సర్పంచ్ బాలమణి శ్రీశైలం, ఉప సర్పంచ్ శోభా కృష్ణారెడ్డి, ఎంపీడీవో బన్సీలాల్, ఎంపీవో రాజు, ఈవో హరిబాబు పాల్గొన్నారు.
పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి
సంగారెడ్డి మున్సిపాలిటీ, జూలై 3 : ప్రజలు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తడి పొడి చెత్తలను వేరుగా ఉంచాలని మున్సిపల్ చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మి అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా 4,5,23,24,25 వార్డుల్లో ఆయా వార్డుల కౌన్సిలర్ల ఆధ్వర్యంలో మొక్కలను అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్, డీఈ ఇంతియాజ్ అమ్మద్, ఎస్ఐ సంపత్‌రెడ్డి, హెల్త్ అసిస్టెంట్ విజయ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
పనులు పరిశీలన
జిన్నారం, జులై 3 : నల్తూరు గ్రామంలో జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్ శనివారం పల్లె ప్రకృతి పనులు పరిశీలించి అనంతరం స్థానిక సర్పంచ్ జనార్దన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజేశ్‌తో కలిసి మొక్కలు నాటారు. కొడకంచిలో ఎంపీడీవో సుమతి, ఎంపీవో రాజ్‌కుమార్ పర్యటించారు. సర్పంచ్ శివరాజ్, పంచాయతీ కార్యదర్శి సాధన గ్రామంలో తిరిగి పరిసరాలను పరిశీలించారు.
బొంతపల్లిలో మొక్కల పంపిణీ
గుమ్మడిదల, జూలై 3: బొంతపల్లిలో సర్పంచ్ ఆలేటి నవీన ఆధ్వర్యంలో ఇంటింటికీ ఆరు మొక్కలను అందజేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలను సంరక్షించాలన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ సంజీవరెడ్డి, మల్లేశ్, వినోద్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
జానపద గేయాలతో పల్లెప్రగతిపై అవగాహన
గుమ్మడిదల, జూలై 3: రాంరెడ్డిబావి గ్రామంలో సర్పంచ్ వాసవిదామోదర్రెడ్డి పర్యవేక్షణలో తెలంగాణ సాంస్కృతిక సారథి గాయకుడు మల్లేశ్ బృందం పల్లెప్రగతి, హరితహారంపై ప్రజలకు కళాజాత ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కళాజాత బృందం సునిల్ దుర్గేశ్, వినేశ్, సంధ్య, స్వప్న, నవీన్ తదితరులు పాల్గొన్నారు.