కంగ్టి, డిసెంబర్ 18 : గత పాలకులు తండాలకు వెళ్లి ఓట్లడిగి గెలుపొంది తమ పబ్బం గడుపుకున్నారే తప్పా.. వారి జీవితాలు మారేలా చర్యలు తీసుకోలేదు. కంగ్టి నుంచి కేవ లం ఐదు కిలోమీటర్ల లోపు ఉండే జీర్గితండా, చందర్తం డాలకు గతేడాది వరకు ప్రయాణించాలంటే నరకప్రాయం గా ఉండేది. రెండు తండాలకు చెందిన గిరిజనులు గతంలో పాలించిన ఎమ్మెల్యేలకు తమ తండాలకు బీటీరోడ్లు కల్పించాలని పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదు. నా రాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి గెలుపొందిన తరువాత తండాల్లో పర్యటించినప్పుడు ఆ తండాలకు చెం దిన గిరిజనులు తమ తండాలకు బీటీరోడ్లు ఏర్పాటు చేయాలని విన్నవించుకున్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే నాల్గు సంవత్సరాల క్రితమే జీర్గితండాలకు రూ. 1.75కోట్లు, చందర్ తండాలకు రూ. 1.65 కోట్ల నిధులను మంజూరు చేశారు. రెండు రోడ్లకు సంబంధించిన కాంట్రాక్ట్ పనులు కాంగ్రెస్ నాయకుడికి రావడంతో టీఆర్ఎస్పై బురద చల్లేందుకు పనులను ప్రారంభించలేదు. ఇది గమనించిన ఎమ్మె ల్యే వేరే కాంట్రాక్టర్‌కు వచ్చేలా చర్యలు తీ సుకుని గతేడాది పనులు ప్రారంభించారు. ఇటీవల రోడ్ల పనులు పూర్తయ్యాయి. దీంతో రెండుతండాలకు ప్రయాణం సుగుమం అయ్యింది.
రోడ్ల ఏర్పాటుతో భూములకు రెక్కలు
జీర్గితండా, చందర్‌నాయక్ తండాలకు బీటీ రోడ్లు ఏర్పాటు కావడంతో రోడ్డుగుం డా ఉన్న భూముల విలువలు అమంతం పెరిగిపోయా యి. టీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజన సంక్షేమం కోసం పాటుపడుతుందని చెప్పడానికి రోడ్ల ఏర్పాటే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. గతంలో పాలించిన కాంగ్రెస్ నాయకులు కేవలం మొరం రోడ్లను వేసి నిధులను కాజేసారే తప్ప పక్కా రోడ్డుకు పూనుకోలేదని ఇక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు.
ప్రయాణం సుగుమం అయ్యింది
జీర్గితాండ, చందర్‌నాయక్ తండాలకు రోడ్ల ఏర్పాటుతో ప్ర యాణం సుగమమైంది. గతం లో ఈ రోడ్లపై వాహనాలు ప్ర యాణించాలంటే చాలా ఇబ్బందులకు గురయ్యేవాళ్లం. గతేడా ది నుంచి ఏరాత్రైనా తండాలకు సురక్షితండా ఇంటికి చేరుకుంటున్నాం.
– రాథోడ్ శీవాజీ, చందర్తండా, కంగ్టి