సంగారెడ్డి కలెక్టరేట్, నవంబర్ 25: విద్యతోనే సమగ్రాభివృద్ధి సాధ్యమని మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టీస్, ఎంపవర్మెంట్ కేంద్ర కమిటీ సభ్యుడు నర్సింహ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన కలెక్టరేట్లోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. సంచార జాతుల కులాలు, అణగారిన వర్గాలకు సంబంధించిన అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, డీఆర్డీ ఏ, హౌసింగ్ శాఖల ద్వా రా అమలు జరుగుతున్న వివిధ పతకాలపై సమీక్షించారు. అనంతరం విద్యాశాఖ ఆధ్వ ర్యంలో ప్రతి సబ్జెక్టుకు 6మంది ఉపాధ్యాయులు, మొత్తం 60మంది ఉపా ధ్యాయులతో సబ్జెక్టు వారిగా చర్చించారు. విద్య ద్వారానే అ న్ని వర్గాల అభివృద్ధి జరుగుతున్నదని స్పష్టం చేశారు. చరిత్ర, జాతీయ బావం, సమైక్యత అలవర్చుకోవాలన్నారు. విద్య నేర్చుకోవడం ద్వారా శాస్త్రజ్ఞులు కావచ్చన్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి, అదనపు ఎస్పీ ఉషావిశ్వనాథ్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి, జిల్లా షె డ్యూల్డు కులాల అభివృద్ధి అధికారి జగదీశ్, డీఈవో రాజేశ్, జిల్లా షెడ్యూ ల్డు కులాల అభివృద్ధి అధికారి ఫిరంగి, డీఎం అండ్ హెచ్‌వో డాక్టర్ గాయత్రీదేవి, డీఆర్డీవో శ్రీనివాసరరావు, డీపీవో సురేశ్ మోహన్, జిల్లా అటవీ శాఖ అధికారి శ్రీధర్‌రావు, ఆర్డీవో నగేశ్, అధికారులు పాల్గొన్నారు.