నారాయణఖేడ్, జూలై 4: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన ఊరు- మన బడి కార్యక్రమంతో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోనున్నాయని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం నారాయణఖేడ్ మండలం అబ్బెందలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో మన ఊరు మనబడి పనులు ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. విద్యారంగాన్ని మరింత పటిష్టపరిచి ప్రభుత్వ విద్యను ప్రైవేట్‌కు దీటుగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. పాఠశాలల్లో వసతులు మెరుగుపడినప్పుడే విద్యార్థులు చదువుపై ఆసక్తి చూపుతారనే ఉద్దేశంతో ప్రభు త్వం కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నదన్నారు. ఇంగ్లిష్ మీడియం విద్యకు ప్రాధాన్యత కల్పిస్తూ అ న్ని పాఠశాలల్లో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడమే లక్ష్యంగా చ ర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఉన్నత విద్యావంతులుగా ఎదగాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ విద్య ను గ్రామీణ స్థాయి నుంచి పటిష్టపరుస్తున్నారన్నారు.
ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని సర్కార్ బడుల పు రోగతికి సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాలలో రూ.16.27 లక్షలు, ఉన్నత పాఠశాలలో రూ.24.48 లక్షలతో చేపట్టే పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఉపాధిహామీ పథకం ద్వారా రూ.17.50 లక్షల నిధులతో ప్రహరీ, రూ.6 లక్షల నిధులతో తాగునీటి వసతి ఏర్పాటు, రూ.3.40 లక్షల నిధులతో కిచెన్‌షెడ్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. కార్యక్రమంలో స ర్పంచ్ సుదర్శన్‌రావు, నాయకులు వెంకట్‌రెడ్డి, రవీందర్‌నాయక్, రమేశ్చౌహాన్, అంజాగౌడ్ పాల్గొన్నారు.
యువతకు స్ఫూర్తి దొడ్డి కొమురయ్య
19 ఏండ్ల చిన్న వయస్సులోనే పాలకులను ఎదిరించి పోరాడిన దొడ్డి కొమురయ్య జీవిత చరిత్ర యువతకు స్ఫూర్తి అని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. దొడ్డి కొమురయ్య వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం జూకల్ శివారులో దొడ్డి కొమురయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాల హ క్కుల కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం దొడ్డి కొమురయ్య చేసిన పోరాటం గొప్పదన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన చూపిన మార్గంలో నడవాలని సూచించారు. కార్యక్రమంలో కల్హేర్ జడ్పీటీసీ నర్సింహారెడ్డి, కురుమ సంఘం మండల అధ్యక్షుడు మల్గొండ, మాజీ ఎంపీటీసీ ప్రభాకర్, నాయకులు నవనాథ్, నర్సింహులు, దత్తు, వెంకట్, దశరథ్, రమేశ్ పాల్గొన్నారు.
కురుమ సంఘం ఆధ్వర్యంలో..
దొడ్డి కొమురయ్య వర్ధంతిని పురస్కరించుకుని దొడ్డి కొమురయ్య విగ్రహానికి కురుమ సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కురుమ సం ఘం కో ఆర్డినేటర్ జ్ఞానేశ్వర్, నాయకులు కృష్ణ, కిష్టయ్య, కాళే రాజు, అనిల్, నవీన్, దత్తు, పవన్ పాల్గొన్నారు.
మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి.
పేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలు అమలు చేసి దేశంలోనే ఆదర్శంగా నిలిచారని ఎమ్మె ల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మోతీబాయి రాథోడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మేత్రి పండరి, సర్పంచులు సంజీవ్‌రెడ్డి, సురేకా రాజ్‌కుమార్ తహసీల్దార్ విజయ్‌కుమార్ ఉన్నారు.