మనోహరాబాద్/ నర్సాపూర్/ చిలిపిచెడ్/ శివ్వంపేట/ మెదక్ రూరల్/ నిజాంపేట/ రామాయంపేట/ హవేళీఘనపూర్/ అల్లాదుర్గం/ టేక్మాల్/ చేగుంట, జూన్ 18 : గ్రామాలను స్వచ్ఛతగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి ప్రజల్లో స్వచ్ఛతపై చైతన్యం నింపిందని జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్ అన్నారు. పల్లెప్రగతి ముగింపు సమావేశాన్ని మనోహరాబాద్ మండలం దండుపల్లిలో నిర్వహించారు. స్వచ్ఛ గ్రామాలే లక్ష్యంగా ఐదు విడతలుగా జరిగిన పల్లె ప్రగతితో గ్రామాలు ఆదర్శంగా మారాయన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ విఠల్‌రెడ్డి, సర్పంచ్ పంజా లక్ష్మి, ఉప సర్పంచ్ మహేందర్‌గౌడ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. మనోహరాబాద్, కాళ్లకల్, గౌతోజిగూడెంలో జరిగిన సమావేశాల్లో ఎంపీడీవో కృష్ణమూర్తి, సర్పంచ్‌లు మహిపాల్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ రేణుకుమార్ పాల్గొన్నారు.
విజయవంతంగా పల్లె ప్రగతి కార్యక్రమాలు
నర్సాపూర్ మండలం పెద్దచింతకుంటలో సర్పంచ్ శివకుమార్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. సభలో వైస్ ఎం పీపీ వెంకటనర్సింగరావు, ఉప సర్పంచ్ నాగరాజు ఉన్నారు.చిలిపిచెడ్ మండలంలోని ఫైజాబాద్, చండూర్, గంగారం, అంతారం, అజ్జమర్రి, గౌతాపూర్, సోమక్కపేట గ్రామాల్లో పంచాయతీ కార్మికులను సన్మానించారు. మెదక్ మండలం మంబోజిపల్లిలో సిబ్బందిని ఎంపీడీవో శ్రీరాములు, సర్పంచ్ ప్రభాకర్ సన్మానించారు. కా ర్యక్రమంలో ఈసీ రాజశేఖర్, టీఏ గౌతమి, ఉప సర్పంచ్ సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
టేక్మాల్‌లో పారిశుధ్య కార్మికులను సర్పంచ్ సుప్రజాభాస్కర్ సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మి, ఎంపీవో హ న్మంతరావు, టీఆర్ఎస్వై జిల్లా కార్యదర్శి నాయికోటి భాస్కర్, వార్డు సభ్యులు కుర్మ బీరప్ప, బాలకృష్ణ పాల్గొన్నారు.శివ్వంపేట మండలంలోని సికింద్లాపూర్‌లో పల్లెప్రగతి ము గింపు గ్రామసభ నిర్వహించారు. కార్మికులను సర్పంచ్ ఏనుగు సుధాకర్‌రెడ్డి ఉప సర్పంచ్ నర్సింహులు సన్మానించారు. నిజాంపేట మండలంలోని నందిగామలో సర్పంచ్ ప్రీతి, ఎంపీవో రాజేందర్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. సభలో పంచాయతీ కార్యదర్శి ఆరిఫ్ హూస్సేన్, ఆశ వర్కర్లు ఉన్నారు.
రామాయంపేట మండలం కోనాపూర్‌లో సర్పంచ్ చంద్రకళ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. సభలో కార్యదర్శి చంద్రహాస్, ఉప సర్పంచ్ దీపక్‌రెడ్డి, వార్డు సభ్యులు ఉన్నారు.
గ్రామాలు శుభ్రంగా ఉండాలి : ఎంపీపీ నారాయణరెడ్డి
ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవా లని ఎంపీపీ శేరి నారాయణరెడ్డి అన్నారు. హవేళీఘనపూర్ మండలం తిమ్మాయిపల్లి(బీ) గ్రామంలో పల్లెప్రగతిపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ బోయిని రాజు, ఎంపీడీవో శ్రీరామ్, ఎంపీవో ప్రవీణ్ పాల్గొన్నారు.
పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారుతున్నట్లు జిల్లా టెలీకాం అడ్వయిజరీ సభ్యుడు కాశీనాథ్ అన్నారు. అల్లాదుర్గం మండలం చేవెళ్లలో కార్మికులను సర్పంచ్ భాగ్యలక్ష్మి ఉన్నారు.
చేగుంట, నార్సింగి మండలాల్లో పల్లెప్రగతి ముగింపు గ్రామసభల్లో అభివృద్ధి పనులపై తీర్మానాలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సబిత, వైస్ ఎంపీపీ సుజాత, సర్పంచ్‌లు శ్రీనివాస్, మహేశ్వరి, షరీఫ్, ఈవో రాణి, కార్యదర్శి అంజిరెడ్డి ఉన్నారు.