అందోల్, జూన్ 18: గ్రామాల అభివృద్ధి కోసమే రాష్ట్ర ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమాన్ని తీసుకువచ్చిందని సంగారెడ్డి కలెక్టర్ శరత్ అన్నారు. ఈ కార్యక్రమంతో గ్రామాలు ఎంతో బాగుపడ్డాయని, ఇదే స్ఫూర్తి నిరంతరం కొనసాగించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. ఐదో విడుత పల్లెప్రగతిలో ఆఖరి రోజైన శనివారం మండల పరిధిలోని అల్మాయిపేట్ను కలెక్టర్ ఆకస్మిక తనిఖీచేశారు. రహదారికి ఇరువైపులా హరితహారంలో నాటిన మొక్కల పెంపకం సరిగా లేకపోవడంపై కార్యదర్శి పనితీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మళ్లీ గ్రామాన్ని సందర్శించే సరికి పరిస్థితులు మారాలన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే ఎలాంటి వ్యాధులు రావన్నారు. హరితహారంలో మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. గ్రామీణ ప్రాంత యువతను క్రీడల్లో ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నదని, ఇందుకోసం ఏర్పాట్లు వేగవంతమవ్వాలన్నారు. గ్రామంలో అర్హులందరికీ పింఛన్లు అందుతున్నాయా.? విద్యుత్, తాగునీటి సరఫరా ఎలా ఉన్నదని గ్రామస్తుల వద్ద ఆరా తీశారు. తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని క్రమం తప్పకుండా చెత్త సేకరించి డంపింగ్‌యార్డుకు తరలించి, కంపోస్టు ఎరువును తయారు చేసి మొక్కలకు వినియోగించాలని సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి సూచించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ధరణిలో వ్యవసాయ భూములకు సంబంధించిన అంశాలపై చర్చించి రైతులకు ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ‘మనఊరు-మనబడి’ ద్వారా చేపడుతున్న పనులు సకాలంలో పూర్తి చేసేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఆర్డీవో అంబాదాస్ రాజేశ్వర్, తహసీల్దార్ అశోక్‌కుమార్, ఎంపీడీవో సత్యనారాయణ, ఎంపీపీ బాలయ్య, ఎంఈవో కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
-సంగారెడ్డి కలెక్టర్ శరత్
వైకుంఠపురంలో కలెక్టర్ పూజలు
సంగారెడ్డి కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన శరత్ శనివారం సంగారెడ్డి పట్టణ శివారులోని వైకుంఠపుర క్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు కందాడై వరదాచార్యులు కలెక్టర్‌కు స్వాగతం పలికారు. ఆలయంలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రధాన అర్చకులు కలెక్టర్‌ను ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
‘శిక్షనాం’ ఆధ్వర్యంలో నోట్ బుక్కుల పంపిణీ
ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహ, సేవా దృక్పథం కలి గి ఉండాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ పే ర్కొన్నారు. శనివారం సంగారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో శిక్ష నాం ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందజేయనున్న నోట్ బుక్కులు, పెన్నులు, పెన్సిళ్లు, జామెట్రీ బాక్స్‌లు తదితర సామగ్రితో కూడిన వాహనాన్ని కలెక్టర్ జెండా ఊపీ ప్రారంభించారు. అనంతరం పలువురు చిన్నారులకు నోటు బుక్కులను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్ర భుత్వం ‘మనఊరు-మనబడి’ కార్యక్రమం చేపట్టి ప్ర భుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి, సకల సౌకర్యాలను సమకూర్చుతున్నదన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యా బోధన జరిగేలా చర్యలు చేపట్టిందన్నారు. జిల్లాలోని 46 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 5వేల మంది పిల్లలకు సామగ్రిని అందజేస్తున్నట్టు ట్రస్ట్ అధ్యక్షుడు మల్లికార్జున్ తెలిపారు. పుల్కల్, చౌటకూర్ మండల్లాల్లో ని 36 ప్రాథమి క పాఠశాలలు, 6 ప్రా థమికోన్నత పా ఠశాలలు, కంది, ము నిపల్లి మండలాల్లో ని 4 పాఠశాలల్లోని విద్యార్థులకు సామగ్రిని అందిస్తున్నట్టు వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీ రారెడ్డి, శిక్షనాం సభ్యులు ప్రవీణ్, సిద్దూ, శ్రీకర్, కిరణ్, చరణ్, ఉషశ్రీ, ప్రశాంతి, శివ, ఉమ్మి, శ శాంక్, సమీర్, రఘు, నిరాల్, రాజేశ్, లింగం, అభిషేక్, అశోక్, సునీల్ తదితరులున్నారు.