సంగారెడ్డి అర్బన్, జూన్ 6: మొక్కలను నాటి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని సంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిధర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సోమవారం సంగారెడ్డి కోర్టులో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పర్యవరణ పరిరక్షణ అవగాహన ర్యాలీ, కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి శశిధర్‌రెడ్డి మొక్కలు నాటా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకుంటేనే భవిష్యత్ తరాల మనుగడ ఇబ్బంది లేకుండా ఉంటుందన్నారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి సుదర్శన్, జిల్లా నాలుగో అదనపు న్యాయమూర్తి రాజు, సీనియర్ సివిల్ జడ్జి పుష్పలత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అబ్దుల్ జలీల్, స్పెషల్ ఎక్సైజ్ కోర్టు జడ్జి హనుమంతరావు, అదనపు ప్రథమ శ్రేణి జడ్జి కుమారి తేజశ్రీ, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆశాలత, సూపరింటెండెంట్ సూజత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు.
నర్సాపూర్‌లో..
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు మండల లీగల్ సర్వీస్ కమిటీ నర్సాపూర్ ఆధ్వర్యంలో జూనియర్ సివిల్ జడ్జి అనిత మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం ప్రతి విద్యార్థి వారి పుట్టినరోజు సందర్భంగా ఒక్కో మొక్క నాటి దేశప్రగతికి పాటుపడాలన్నారు. అంతకుముందు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీపీవో రాఘవేంద్ర, ఏజీపీ సత్యనారాయణ, బార్ ప్రెసిడెంట్ అంజిరెడ్డి, సీనియర్ న్యాయవాది ఎండీ జాఫర్అలీ, ప్రకాశ్, ఎస్కే శ్రీనివాస్, ఆర్.శ్రీనివాస్‌రెడ్డి, ప్ర భు, స్వరూపరాణి, సుధాకర్, నాగరాజు, న్యాయవాదులు, ఎస్ఐ శ్రీనివాస్, కోర్టు సూపరింటెండెంట్ అనురాధ, సీనియర్ అసిస్టెంట్ శ్యామ్, ఫారెస్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.