సంగారెడ్డి అర్బన్, జూన్ 6: కష్టపడి చదివి పోలీస్ ఉద్యోగాలు సాధించాలని సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్ సూచించారు. పోలీస్ ఉచిత శిక్షణలో భాగంగా సంగారెడ్డి అంబేద్కర్ భవన్లో శిక్షణ పొందుతున్న అ భ్యర్థులకు సోమవారం ఎస్పీ రమణకుమార్ ఉచితంగా స్టడీ మెటీరియల్, టీ-షర్టులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పోలీస్, కలెక్టర్ సహాయ సహకారాలతో సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కష్టపడే తత్వం ఉంటే విజయాలు సాధిస్తారన్నారు. కార్యక్రమంలో సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ, పట్టణ సీఐ రమేశ్, సిబ్బంది, శిక్షణ అభ్యర్థులు పాల్గొన్నారు.